సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK: బాలయ్య-కొరటాల సినిమాలో తమిళ హీరో..

ABN, Publish Date - Aug 31 , 2026 | 01:35 PM

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మాస్ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు.

నందమూరి బాలకృష్ణ (NBK) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మాస్ కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో  (koratala Shiva) ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరో ఆర్యను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆర్య ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపించనున్నారని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. కథలో ఆ పోలీస్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. సినిమా కథను మలుపు తిప్పే కొన్ని కీలక సంఘటనలతో ఈ పాత్రకు సంబంధం ఉంటుందట. బాలకృష్ణ పాత్రతో ఆర్యకు వచ్చే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని టాక్. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయని సమాచారం. అయితే ఆర్య పాత్ర బాలయ్యకు ప్రత్యర్థిగా ఉంటుందా? లేక ఆయనకు సహాయపడే కీలక పాత్రలో కనిపిస్తారా? అనే విషయంలో అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆర్యకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ‘వరుడు’, ‘సైజ్ జీరో’ సినిమాల్లో నటించిన ఆయన.. పలు తమిళ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెర్షన్లతో కూడా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అందుకే బాలయ్య సినిమాలో ఆర్య నటిస్తారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. ఈ భారీ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు సమాచారం. ఇటీవల బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్ కొంత ఆలస్యం అయిన సంగతి  తెలిసిందే.  ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

 

Updated Date - Aug 31 , 2026 | 01:52 PM