సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఇద్దరు హీరోయిన్లతో.. ఆది సాయికుమార్ కొత్త సినిమా 'అరుంధతి నక్షత్రం'

ABN, Publish Date - Nov 16 , 2026 | 09:29 AM

ఆది సాయికుమార్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'అరుంధతి నక్షత్రం' సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Aadi Saikumar

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'అరుంధతి నక్షత్రం' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. 'ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మేఘా శెట్టి, మధు దామరాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

7పీఎం ప్రొడక్షన్స్, శ్రీచక్ర మూవీస్ ఎల్ఎల్సీ బ్యానర్లపై సందీప్ ఆగరం, అష్మిత రెడ్డి బాసాని, డా. సూర్యకాంతి కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు సాయికుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి కూచిభొట్ల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి నిర్మాతలు స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తమ బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చేలా 'అరుంధతి నక్షత్రం' చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ కుటుంబ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

Updated Date - Nov 16 , 2026 | 09:29 AM