సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దేవుడా .. అర్జున్ రెడ్డి ప్రీతి ఏంట్రా ఇలా తయారయ్యింది

ABN, Publish Date - Jun 05 , 2026 | 06:32 PM

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. నటీనటుల కెరీర్ లో మైలురాయిగా గుర్తుండిపోతుంది. హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) కెరీర్ లో అర్జున్ రెడ్డి అలాంటి సినిమానే.

Shalini Pandey

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. నటీనటుల కెరీర్ లో మైలురాయిగా గుర్తుండిపోతుంది. హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) కెరీర్ లో అర్జున్ రెడ్డి అలాంటి సినిమానే. బూరె బుగ్గలు వేసుకొని, అమాయకమైన ముఖంతో అర్జున్ రెడ్డి (Arjun Reddy) లాంటి యాంగ్రీ కుర్రాడిని కూడా తన ప్రేమలో దింపేసిన అందం ఆమె సొంతం. కేవలం అందంతోనే కాదు.. నటనలో కూడా విమర్శకుల ప్రశంసలను అందుకుంది షాలిని. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ చిన్నది.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇంకా ప్రీతిగానే కొనసాగుతోంది.


అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండకు ఎంతైతే పేరు వచ్చిందో.. షాలినికి కూడా అంతే పేరు వచ్చింది. అమ్మడిని చూసి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి. షాలినికి కథలను ఎంచుకోవడం రాలేదో.. లేక టాలీవుడ్ లో ఉండడం ఇష్టం లేదో తెలియదు కానీ.. తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కి చెక్కేసింది. బాలీవుడ్ లో బొద్దు భామలు ఉండరు అనుకుందేమో.. బాగా కష్టపడి జీరో సైజ్ చేసి.. అస్సలు గుర్తుపట్టలేకుండా మారిపోయింది.


జీరో సైజ్ చేసి, గ్లామర్ ఒలకబోసినా కూడా షాలినికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు తలుపుతట్టింది లేదు. అడపాదడపా కనిపించినా కూడా అవేమి షాలినికి పేరు తీసుకురాలేదు. ప్రస్తుతం ఈ చిన్నది మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోనే ఉంది. అయినా సినిమాలు లేకపోతేనే సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.


తాజాగా షాలిని ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. చాక్లెట్ బ్రౌన్ బాడీకాన్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తూ కనిపించింది. ఈ అవుట్‌ఫిట్‌కి ప్రధాన ఆకర్షణగా ఆమె మెడ చుట్టూ ధరించిన బ్లాక్ ఫర్ స్కార్ఫ్ అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది. ఇక జీరో సైజ్ నడుము, పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో ఉన్న ఆమె గ్లామరస్ పోజులు చూసి నెటిజన్లు అర్జున్ రెడ్డి ప్రీతి ఏంటి ఇలా మారిపోయింది.. అప్పుడు ఎంత బావుండేది అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మార్ ఈ చిన్నది మళ్ళీ ఎప్పుడు తెలుగు సినిమాలో కనిపిస్తుందో చూడాలి.

Updated Date - Jun 05 , 2026 | 07:48 PM