సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అయ్యో.. ఎంత ప‌నైంది! ఇప్పుడు.. బోయపాటి ప‌రిస్థితి ఏంటి?

ABN, Publish Date - Aug 30 , 2026 | 11:19 AM

టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. ఆయన తెరకెక్కించే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్ ఉంటుంది.

Boyapati Srinu

టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలు అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఆయన తెరకెక్కించే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. థియేటర్లలో పూనకాలు తెప్పించే మాస్ ఎలివేషన్స్, దద్దరిల్లిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు ఆయన ప్రత్యేకత. అయితే, నందమూరి బాలకృష్ణతో కుదిరిన మ్యాజిక్ మిగతా హీరోల విషయంలో అంతగా సెట్‌ కాలేదనేది మాత్రం వాస్తవం.

బాలయ్యతో సింహా, లెజెండ్, అఖండ వంటి సరికొత్త బ్లాక్‌బస్టర్స్ అందుకున్న బోయపాటి, ఇతర హీరోలతో చేసిన ప్రయోగాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. రవితేజతో భద్ర, వెంకటేష్‌తో తులసి, అల్లు అర్జున్‌తో సరైనోడు వంటి చిత్రాలు కమర్షియల్ వర్కవుట్ అయ్యాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ము, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తీసిన జయ జానకీ నాయక, రామ్ పోతినేనితో చేసిన స్కంద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయాయి.

వీటిలో యాక్షన్ పీక్స్ లో ఉన్నప్పటికీ, బలమైన కథాకథనాలు కొరవడటంతో బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పలేదు. ఇక గతేడాది వచ్చిన అఖండ-2 చిత్రం అంచనాల స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మేజిక్ చేయలేకపోవడం, నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా సమీకరణాలు మారాయి. ఈ ప్రభావం ప్రస్తుతం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై తీవ్రంగా పడుతోంది.

రీసెంట్‌గా కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా ఉంటుందని, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ లాక్ అయిందనే రూమర్స్ వినిపించినా, ఫైనల్ వెర్షన్ వచ్చేసరికి ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో భారీ లైనప్‌తో బిజీగా ఉన్నారు.

మరోవైపు టైర్-2 హీరోలు కూడా తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉన్న డైరెక్టర్లతో వరుస చిత్రాలు కమిట్ అయ్యారు. దీంతో తదుపరి సినిమా ఎవరితో చేయాలనేదానిపై బోయపాటికి సరైన హీరో దొరకడం కష్టంగా మారింది. బలమైన కథను సిద్ధం చేసుకుని, ప్రేక్షకులకు కొత్తదనం అందించేలా రూట్ మార్చితే తప్ప, మాస్ డైరెక్టర్ ఎదురుచూపులకు తెరపడేలా కనిపించడం లేదు.

Updated Date - Aug 30 , 2026 | 02:03 PM