సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హనుమాన్ అంశ్.. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే

ABN, Publish Date - Oct 11 , 2026 | 09:31 PM

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు అయ్యిపోయింది హనుమాన్ అంశ్ పరిస్థితి. బాలీవుడ్ 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అనేసరికి తెలుగులో కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

Hanuman Ansh

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు అయ్యిపోయింది హనుమాన్ అంశ్ (Hanuman Ansh) పరిస్థితి. బాలీవుడ్ 400 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అనేసరికి తెలుగులో కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఒక భాషలో ఇండస్ట్రీ హిట్ అయిన సినిమా, వేరే భాషలోనూ అదే స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందనే నమ్మకం లేదని మరోసారి హనుమాన్ అంశ్ నిరూపించింది. మొదట ఈ సినిమాని త్రివిక్రమ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, కొన్ని కారణాలతో ఈ సినిమా హోంబాలే చేతికి వెళ్లింది. ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 9 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.


అదేంటి.. అంత మంచి సినిమా.. భారీ కలక్షన్స్ రాబట్టిన సినిమా ఇక్కడ పరాజయం పాలవ్వడం ఏంటి అంటే.. ప్రేక్షకుల అభిరుచి అని కచ్చితంగా చెప్పొచ్చు. తెలుగు నేటివిటీలో భక్తి సినిమాలు అంటే ఒక నమ్మకం. ఈ సినిమాలో అన్నీ ఉన్నా చాలా స్లోగా సాగే నేరేషన్ తెలుగువారికి ఎక్కలేదు. కంటెంట్ ఎంత బాగున్నా, ఇక్కడి నేటివిటీకి సరిపోకపోతే ఎంతటి పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమానైనా పక్కన పెట్టడానికి వారు వెనుకాడరు. ఇందుకు ఇటీవలి కాలంలో విడుదలైన కొన్ని డబ్బింగ్ సినిమాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఉత్తరాదిలో భారీ వసూళ్లు సాధించిన చిత్రాలు లేదా మలయాళంలో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన కొన్ని సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.


అలా అని ప్రతి డబ్బింగ్ సినిమాకి ఇలానే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎన్నో తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి భారీ విజయాలను అందుకున్నాయి. మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, కాంతార, లోక.. ఇలా మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అంతెందుకు మొన్నీమధ్య వచ్చిన బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ కూడా తెలుగులో ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు. కానీ, ఓటీటీలో చూసిన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అంటే కంటెంట్‌లో అసలైన మ్యాజిక్ ఉంటేనే టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారని స్పష్టమవుతోంది. ఏదిఏమైనా హనుమాన్ అంశ్ రిలీజ్ చేయకుండా ఆగిపోయి త్రివిక్రమ్ మంచి పని చేశాడనే చెప్పొచ్చు. వేరే భాషల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది కాదు.. తెలుగువారి అభిరుచికి తగ్గట్లు డబ్బింగ్ చేసామా.. వారికి నచ్చుతుందా.. అనేది కూడా ఇక్కడ మేకర్స్ అర్ధం చేసుకుంటే బావుంటుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 09:31 PM