సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Apsara vydyula: ప్రపంచానికి ఆమె గొప్ప గాయని.. నాకు మాత్రం..

ABN, Publish Date - Jul 12 , 2026 | 01:38 PM

భారతీయ సంగీత ప్రపంచానికి చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎస్. జానకి మరణంతో  ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా జానకి మనవరాలు అప్సర వైద్యుల భావోద్వేగంగా స్పందించారు

భారతీయ సంగీత ప్రపంచానికి చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎస్. జానకి (S Janaki) మరణంతో  ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా జానకి మనవరాలు అప్సర వైద్యుల (Apsara) భావోద్వేగంగా స్పందించారు. అప్సర మాట్లాడుతూ 'నానమ్మ మరణం మా  కుటుంబానికే  కాదు.. దేశంతో పాటు ప్రపంచ సంగీతాభిమానులందరికీ తీరని లోటు. నానమ్మ గొప్ప గాయని మాత్రమే కాదు. ప్రతి పాటలో భావాలను అద్భుతంగా పలికించిన అరుదైన కళాకారిణి.  ఆమె ఆలపించిన ప్రతి గీతం శ్రోతల హృదయాలను నేరుగా తాకేది. జానకమ్మకు మనవరాలిగా పుట్టడం గొప్ప వరంగా భావిస్తున్నా. ఆమె  నుంచి సంగీతం మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా గడపాలి, మనుషులతో ఎలా మెలగాలి అనే విలువలను కూడా నేర్చుకున్నాను. ప్రపంచమంతా ఆమెను గొప్ప  గాయనిగా చూసినా, నాకు మాత్రం ప్రేమను పంచే నానమ్మగానే ఎప్పటికీ గుర్తుంటారు' అని  చెప్పారు. 'ఆమె పాడిన వేలాది పాటలే ఇప్పుడు మాకు గొప్ప జ్ఞాపకం. ఆ స్వరాల రూపంలో ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆమెతో మా అనుబంధానికి వీడ్కోలు అనే మాటే లేదు' అని అప్సర అన్నారు. జానకమ్మ  నిరాడంబర జీవనశైలిని గుర్తు చేసుకుంటూ 'ఎంతటి పేరున్నా ఆమె ఎప్పుడూ వినయాన్ని వీడలేదని అప్సర పేర్కొన్నారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడటం, జంతువుల పట్ల అపారమైన ప్రేమ చూపించడం ఆమె వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన లక్షణాలని చెప్పారు. ఆమెను ఒక్కసారి కలిసిన వారెవరైనా ఆమె సింప్లిసిటీని, మంచితనాన్ని తప్పకుండా గుర్తుంచుకుంటారని అన్నారు. భౌతికంగా ఆమె తమ మధ్య లేకపోయినా, ఆమె గాత్రం ఎప్పటికీ అమరమై ఉంటుందని అప్సర భావోద్వేగానికి లోనయ్యారు. 

Updated Date - Jul 12 , 2026 | 01:57 PM