పాకెట్ రాకెట్స్.. నిహారిక క్షుద్ర పూజలు..
ABN, Publish Date - Nov 23 , 2026 | 09:28 PM
ఇప్పటివరకు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి చేసే ప్రమోషన్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఎవరూ చేయలేరని ఒక టాక్ ఉంది. అయితే తాజాగా రాజమౌళి తరువాత అలాంటి డిఫరెంట్ ప్రమోషన్స్ చేయడంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) కొట్టేవారు లేరని నిరూపిస్తుంది.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి చేసే ప్రమోషన్స్ కన్నా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఎవరూ చేయలేరని ఒక టాక్ ఉంది. అయితే తాజాగా రాజమౌళి తరువాత అలాంటి డిఫరెంట్ ప్రమోషన్స్ చేయడంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) కొట్టేవారు లేరని నిరూపిస్తుంది. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా కూడా నిహారిక ప్రస్తుతం నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలని నిర్మిస్తోంది. తన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్లుతో జాతీయ అవార్డు అందుకున్న ఈ భామ.. తాజాగా మరో కొత్త సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. త్రినాథ్ వర్మ, నిర్మల్, శ్రియ కొంతమ్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పాకెట్స్ రాకెట్స్ (Pocket Rockkets). రుద్ర అత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (PEP), మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా పాకెట్ రాకెట్స్ నుంచి జరా జరా అప్సరా అని సాగే మొదటి సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఆ సాంగ్ అప్డేట్ ని నిహారిక చాలా కొత్తగా కంచంలో కపాలం అనే పేరుతో ఒక ప్రమోషన్ వీడియో ద్వారా తెలిపింది. సాధారణ ప్రమోషన్లకు భిన్నంగా, ఈ పాటను 1 మిలియన్ వ్యూస్‌తో నెంబర్ వన్ ట్రెండింగ్‌లోకి తీసుకురావడానికి ఇద్దరు హీరోలు ఏకంగా ప్రమోషన్ యాగం పేరుతో క్షుద్ర పూజలు, వింత ప్రయోగాలు చేస్తూ కనిపించారు. చిత్ర బృందం పూజలు చేస్తూ హడావిడి చేస్తుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల వారిని చూసి ఆశ్చర్యపోతూ 'ఏంటీ క్షుద్ర పూజలు?' అంటూ ఆడగగా.. దానికి హీరోలు స్పందిస్తూ.. 'ఈ పూజ చేస్తే మన సాంగ్‌కి పెద్ద పెద్ద నంబర్లు వస్తాయని జేడీ సార్ (జేడీ చక్రవర్తి) చెప్పారు. ఆయన ఇలా చేయడం వల్లే ఆయన సినిమాలో పెద్ద పెద్ద హీరోలందరూ యాక్సెప్ట్ చేశారు' అంటూ పంచులు వేయడం నవ్వులు పూయిస్తోంది.
అంతేకాకుండా, పాట లాంచ్ విషయంలోనూ టీమ్ సభ్యులు నిహారికపై సెటైర్లు వేశారు. 'రాకాసాక సినిమాకు రామ్ చరణ్ గారిని సెట్ చేశారు కదా.. మరి మా అప్సరా సాంగ్ లాంచ్‌కు ముగ్గురు నలుగురు అప్సరసలను తీసుకురండి' అంటూ చేసిన సంభాషణ హైలైట్‌గా నిలిచింది. వీడియో చివర్లో హీరో నిర్మల్ వేసుకున్న వింత మేకప్ గురించి నిహారిక అడగగా.. 'కమల్ హాసన్ గారి ఇన్స్పిరేషన్తో నాకు నేనే వేసుకున్నాను' అని చెప్పిన డైలాగ్ మరింత కామెడీని పంచింది. ఇలా జేడీ చక్రవర్తి, రామ్ చరణ్, కమల్ హాసన్ వంటి స్టార్ల పేర్లను సరదాగా వాడుతూ క్రియేట్ చేసిన ఈ స్కిట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఇక చివరికి ముగ్గురు అప్సరసలతో ఈ సాంగ్ నినవంబర్ 24 రిలీజ్ చేయనించనున్నామని తెలిపారు. అయితే ఆ ముగ్గురు అప్సరసలు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రమోషన్స్ చేసి నిహారిక సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.