సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఉస్తాద్ భగత్ సింగ్: బెనిఫిట్ షోలకు ఏపీ సర్కార్ అనుమతి   

ABN, Publish Date - Mar 13 , 2026 | 07:44 PM

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad bhagat singh) ఉగాది సందర్భంగా ఈ నెల 19న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad bhagat singh) ఉగాది సందర్భంగా ఈ నెల 19న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇస్తూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.  అలాగే టికెట్‌ ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతినిస్తూ ఉత్తర్వులు  జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చింది. దీనికి పన్నుతో  కలిపి టికెట్‌ ధరను రూ.500గా  నిర్ణయించింది.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చి, పెంచిన ధరలు  ఈ నెల  19 నుంచి  28 వరకూ అమల్లో ఉంటాయని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  మైత్రి మూవీ మేకర్స్  నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు.  దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. నేపథ్య సంగీతానికి తమన్ పని చేశారు. 

Updated Date - Mar 13 , 2026 | 08:12 PM