Tollywood: సినీరంగం అభివృద్ధికి భరత్‌భూషణ్‌కు కీలక పదవి..

ABN , Publish Date - May 09 , 2026 | 12:13 PM

తాజాగా మాజీ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ చైర్మన్‌ పి.భరత్‌భూషణ్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్దికి ఎంతో అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. సినిమానే కాకుండా, టీవీ, నాటన రంగాలను కూడా అభివృద్ది చేసే దిశగా ముందుకెళ్తుంది. తాజాగా మాజీ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ చైర్మన్‌ పి.భరత్‌భూషణ్‌కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగం అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భరత్‌భూషణ్‌ను నియమించింది. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ఇంతకుముందు భరత్‌భూషణ్‌ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ అద్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

Updated Date - May 09 , 2026 | 12:14 PM