Director Samudra: డబ్బు వసూలు చేసినా.. పేరు వాడినా.. ఊరుకోను
ABN, Publish Date - Jun 30 , 2026 | 11:52 AM
ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర (Samudra) స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలను, దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి. కమిటీ అద్భుతంగా ఉందని, పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
'ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఇంకా ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదు. ఆ స్థలాల కోసం డబ్బులు తీసుకుంటున్నారని కొందరు ఫోనులు చేసి ఎంక్వయిరీ చేయడంతో వివరణ ఇస్తున్నాను. అటువంటి కార్యక్రమాలతో నాకు సంబంధం లేదు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో డబ్బులు వసూలు చేసినా… నా పేరు చెప్పినా, వాడినా ఊరుకోను' అని సముద్ర హెచ్చరించారు, ఏపీ ఎఫ్.డి.సి. సంస్థకి సంబంధించిన ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఏపీలో చిత్రసీమ అభివృద్ధికి ఏపీ ఎఫ్.డి.సి. డైరెక్టర్ గా తన వంతు కృషి చేస్తానని సముద్ర తెలిపారు.
Also Read: Bandla Ganesh: మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం
Ramayana: రామాయణ ట్రైలర్.. ప్రత్యేకత అదే