Pawan Kalyan: వీరాభిమాని కోసం.. నేడు వరంగల్‌కు పవన్ కల్యాణ్
ABN, Publish Date - Jun 17 , 2026 | 08:16 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం వరంగల్‌కు రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం వరంగల్ (Warangal) రానున్నట్లు జనసేన (Jana Sena Party) కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వరంగల్‌లో తన వీరాభిమాని నిరంజన్ (Niranjan)ను ఆయన పరామర్శించనున్నారు.
పవన్ కల్యాణ్ ముందుగా హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుంచి వరంగల్‌కు వెళతారు. అక్కడ ఆయన నిరంజన్‌ను కలిసేందుకు పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కార్యక్రమం అనంతరం పవన్ నేరుగా హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో వరంగల్‌లో జనసేన శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి.