చిన్నారి అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్..
ABN, Publish Date - Jun 17 , 2026 | 03:39 PM
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... ఈ పేరు వింటేనే లక్షలాది మంది అభిమానుల నరాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఆయనొక రియల్ హీరో అన్నది పదే పదే రుజువవుతున్న వాస్తవం.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)... ఈ పేరు వింటేనే లక్షలాది మంది అభిమానుల నరాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఆయనొక రియల్ హీరో అన్నది పదే పదే రుజువవుతున్న వాస్తవం. పదవులు ఆయన వ్యక్తిత్వాన్ని మార్చలేవని, ఆపదలో ఉన్నవాడికి అండగా నిలిచే ఆయన మంచి మనసు ఎప్పటికీ మారదని తాజాగా జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... తన వీరాభిమాని కోసం, ఒక పసివాడి కోరిక తీర్చడం కోసం ఆయన వరంగల్ పర్యటనకు రావడం ఇప్పుడు అందరి హృదయాలను హత్తుకుంటోంది.
వరంగల్‌కు చెందిన నిరంజన్ అనే చిన్నారి గత కొంతకాలంగా ఒక అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. ఆ చిన్నారి.. పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. చనిపోయేలోపులో ఆయనను చూడాలని పేరెంట్స్ ని కోరాడు. దీంతో కొందరు చిన్నారి కోరికని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పవన్ కళ్యాణ్ ఆ వీడియోను చూసి చిన్నారి కోరికను నెరవేర్చడానికి వరంగల్ వచ్చారు. నిరంజన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. ఐప్యాడ్ లో ఓజీ సినిమా చూడమని చెప్పడమే కాకుండా ఓజీ 2 కి చిన్నారిని గెస్ట్ గా పిలుస్తానని చెప్పారు. అనంతరం చిన్నారి పేరు మీద పూజలు చేయించి.. పసిబిడ్డను కాపాడాలని అమ్మవారిని కోరుకున్నారు. తన అభిమాన హీరో, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి స్వయంగా తన కోసం రావడంతో ఆ చిన్నారి కళ్ళలో ఆనందం వర్ణనాతీతం. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక నిరంజన్ ని కలవడంపై పవన్ ఎమోషనల్ అయ్యారు. ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.. అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పవన్ చేసిన పనికి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్