సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అరుదైన మొక్క..పేరు పెట్టిన‌ పవన్ కళ్యాణ్

ABN, Publish Date - Jul 30 , 2026 | 10:35 AM

తిరుపతి జిల్లా ఉబ్బలమడుగు జలపాతం సమీపంలో గుర్తించిన అరుదైన కొత్త వృక్షజాతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నామకరణం చేశారు.

Pawan Kalyan

తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జల పాతం ప్రాంతంలో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్షజాతికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు పెట్టడం స‌ర్వ‌త్రా ఆసక్తికరంగా మారింది. తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం పరిసరాల్లో వెలుగుచూసిన ఈ కొత్త మొక్కకు 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' (Croton ubbalamadugensis) అనే శాస్త్రీయ నామకరణం జరిగింది.

ఈ అరుదైన మొక్క యూపోర్బియేసీ (Euphorbiaceae) కుటుంబానికి చెందినదిగా వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతమే ఈ మొక్కకు ప్రధాన సహజ ఆవాసంగా ఉండటంతో, ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో 'ఉబ్బలమడుగెన్సిస్' అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపారు.

ఈ కొత్త వృక్షజాతిని రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి పీవీ చలపతిరావు తన పరిశోధనా బృందంతో కలిసి తూర్పు కనుమల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర అధ్యయనాల సందర్భంగా గుర్తించారు. పరిశోధనలో ఈ మొక్క ఇప్పటివరకు నమోదు కాని కొత్త జాతికి చెందినదిగా నిర్ధారణ అయింది. పరిశోధకుల అంచనా ప్రకారం, ఈ వృక్షజాతి అత్యంత పరిమిత ప్రాంతంలో మాత్రమే పెరుగుతోంది. అందువల్ల ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అరుదైన జాతిగా పరిగణిస్తున్నారు. ఈ మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' ఆవిష్కరణ తూర్పు కనుమల జీవ వైవిధ్యానికి మరో గుర్తింపుగా నిలవడంతో పాటు, ఆ ప్రాంతంలో ఇంకా ఎన్నో అరుదైన వృక్షజాతులు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 10:35 AM