సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్ లోకేశ్.. ఏఏ23 ఆగిపోయిందా?

ABN, Publish Date - Jun 04 , 2026 | 11:56 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

AA 23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ.. ఇప్పుడు తన లైనప్‌ను మరింత బలంగా మార్చుకుంటున్నారు. పుష్ప రాజ్ గా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఆయన సృష్టించిన సునామీ ఎలాంటిదో అందరికీ తెలుసు. అయితే, ఇప్పుడు బన్నీ లైనప్ చూస్తుంటే.. రాబోయే రోజుల్లో రికార్డులన్నీ తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం కోలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు రాకా అనే టైటిల్‌ను కూడా ఫిక్స్‌ చేశారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ సోషియో డ్రామాగా రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అట్లీ మార్క్ ఎలివేషన్స్ తో పాటు, బన్నీ స్టైలిష్ స్వాగ్ ఈ సినిమాలో ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే కథ ఇక్కడే రసవత్తరంగా మారింది.

ఒకపక్క అట్లీ సినిమా సెట్స్‌పై ఉండగానే.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ (Lokesh kankaraj) తో AA23 మరో సినిమాను పట్టాలెక్కించేందుకు బన్నీ సిద్ధమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ థీమ్ వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్‌లో అంచనాలను ఆకాశానికెత్తింది. కానీ.. ఏమైందో ఏమో సడెన్‌గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. బన్నీ, లోకేష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో బన్నీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

కానీ మైత్రీ మూవీ మేకర్స్ టీమ్.. ఎట్టకేలకు ఈ రూమర్స్‌పై అఫీషియల్ గా స్పందించింది. అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అస్సలు ఆగిపోలేదు. ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమే. ప్రస్తుతం బన్నీ రాకా చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే లోకేష్ మూవీ సెట్స్‌పైకి వెళుతుంది. ప్రస్తుతం ఏఏ23 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి అని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అట్లీతో చేస్తున్న రాకా మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ.. ఆడియన్స్ దృష్టి మొత్తం లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌పైనే ఉంది.

ఎందుకంటే, లోకేష్ తీసే యాక్షన్ సీక్వెన్స్ లు, ఇచ్చే హీరో ఎలివేషన్స్ బన్నీకి పడితే.. బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని మ్యాజిక్ క్రియేట్ అవుతుంది. అలాగే, ఇప్పటి వరకు లోకేష్ తీసిన సినిమాలకు, ఈ చిత్రానికి చాలా వ్యత్యాసం ఉండబోతోందని ఇన్‌సైడ్ టాక్. ఇది ఎల్.సి.యు. లో భాగం కాకుండా.. ఒక సరికొత్త ఇండిపెండెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోందని సమాచారం. మొత్తానికి ఐకాన్ స్టార్ లైనప్ చూస్తుంటే.. ఇండియన్ బాక్సాఫీస్ మీద దండయాత్ర గట్టిగానే ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. 'రాకా' తో పాటు రాబోయే 'ఏఏ23' తో బన్నీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.

Updated Date - Jun 04 , 2026 | 12:13 PM