సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

షాకింగ్.. అనుపమ పరమేశ్వరన్ పెళ్లి.. ఫోటోలు వైరల్

ABN, Publish Date - Sep 12 , 2026 | 07:50 PM

టాలీవుడ్ చార్మింగ్ నటి అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ వార్తల వల్ల నిత్యం వార్తల్లో నిలిచింది.

Anupama Parameswaran

టాలీవుడ్ చార్మింగ్ నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ, ఇటీవల తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో బ్రేకప్ వార్తల వల్ల నిత్యం వార్తల్లో నిలిచింది. ధ్రువ్ ప్రవర్తన ఎంతో టాక్సిక్‌గా ఉండేదని, ఆఖరికి తన సొంత తమ్ముడిని ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని అనుపమ చేసిన సంచలన ఆరోపణలు అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించాయి.


ధ్రువ్‌తో బ్రేకప్ అనంతరం అనుపమ తన దృష్టినంతా పూర్తిగా సినిమాలపైనే పెట్టి వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయిన విషయం కూడా తెల్సిందే. అయితే ఇలాంటి సమయంలో ఉన్నట్టుండి ఆమె పెళ్లి పీటలెక్కినట్లుగా ఉన్న పిక్స్ నెట్టింట ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పసుపు దంచడం, హల్దీ వేడుకతో పాటు వరుడి తలపై జీలకర్ర బెల్లం పెడుతున్న ఫొటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో షేర్ అవ్వడంతో అనుపమ నిజంగానే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.


అయితే వైరల్ అవుతున్న ఈ పెళ్లి ఫొటోల వెనుక ఉన్న అసలు నిజం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి అనుపమ నిజ జీవిత పెళ్లికి సంబంధించిన ఫొటోలు కాదని, ఒక ప్రముఖ బ్రాండ్ కోసం చేసిన కమర్షియల్ యాడ్ షూట్ లో భాగమని తెలుస్తోంది. ప్రకటనల కోసం సాంప్రదాయబద్ధమైన పెళ్లికూతురి లుక్‌లో ఆమె కనిపించడంతో, కొంతమంది ఆ ఫొటోలను నిజమైన పెళ్లి వేడుకగా భావించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.


ఏది ఏమైనప్పటికీ అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకుందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం ఆమె తన కెరీర్‌పై మాత్రమే దృష్టి సారించి సరికొత్త చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతోంది. రూమర్లకు చెక్ పెడుతూ ఈ ఫొటోల వెనుక ఉన్న షూటింగ్ కాన్సెప్ట్ బయటకు రావడంతో అనుపమ మ్యారేజ్ గాసిప్స్‌కు ఇక్కడితో తెరపడినట్లయింది.

Updated Date - Sep 12 , 2026 | 08:19 PM