సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెళ్లికి రెడీ అవుతోన్న మలయాళ బ్యూటీ...

ABN, Publish Date - Apr 06 , 2026 | 01:05 PM

మలయాళ బ్యూటీ, అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి పెళ్లి వైపు అడుగులు వేయబోతోందని మాలీవుడ్‌ మీడియా (mollywood) ప్రచారం చేస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. హీరోలు, హీరోయిన్లు పెళ్లి బాట పట్టారు. ఈ మధ్యనే విజయ్‌, రష్మిక పెళ్లి చేసుకున్నారు. త్వరలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ ఓ ఇంటివాడు కానున్నారు. తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్‌ కూడా పెళ్లి పీటలెక్కడానికి సిద్దమైనట్లు తెలిసింది. మలయాళ బ్యూటీ, అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి పెళ్లి వైపు అడుగులు వేయబోతోందని మాలీవుడ్‌ మీడియా (mollywood) ప్రచారం చేస్తోంది. ఆమె పెళ్లి ఖాయమైందని, వచ్చే నెలలో నిశ్చితార్థమని అంటున్నారు. ప్రస్తుతం అనుపమ సౌత్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె కెరీర్‌ కూడా మంచి దశలో ఉంది. అందుకేనేమో వ్యక్తిగత జీవితంపైనా ఓ నిర్ణయానికి వచ్చినట్లుంది. సినిమాకు సంబంధించిన వ్యక్తినే ఆమె పెళ్లి చేసుకోనుందని కూడా టాక్‌. ఇది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది. కథానాయికల పెళ్లిళ్ల విషయంలో ఇలాంటి వార్తలు సహజంగా వస్తుంటాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే అనుపమా పరమేశ్వరన్‌ పెదవి విప్పాల్సిందే!

Updated Date - Apr 06 , 2026 | 01:18 PM