Anupama Parameswaran: మూడు హృదయాలు.. ఒక హ్యాపీ ఫ్రేమ్‌లో..
ABN, Publish Date - Aug 04 , 2026 | 12:57 PM
అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran), నివేదా థామస్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే! నివేదా తమ్ముడు నిఖిల్ కూడా వీరిద్దరికీ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు.
అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran), నివేదా థామస్ (Niveమంచి స్నేహితులన్న విషయం తెలిసిందే! నివేదా తమ్ముడు నిఖిల్ కూడా వీరిద్దరికీ బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటాడు. సరదాగా ఇద్దరినీ ఆట పట్టిస్తుంటాడు. ఈ మధ్యన అనుపమ వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమలో మునిగి తేలుతుందని ఆ వార్తల సారాంశం. అయితే ఆమె అవేమీ మరసులోకి తీసుకోకుండా తనకు ఇష్టమైన స్నేహితులతో సరదాగా చిల్ అవుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న గాసిప్స్‌ను పట్టించుకోకుండా తన డైలీ రొటీన్‌ను కొనసాగించడం చర్చనీయాంశమైంది.
తాజాగా అనుపమ తన క్లోజ్ ఫ్రెండ్, హీరోయిన్ నివేదా థామస్ ఇంటికి వెళ్లింది. అక్కడి అనుపమ, నివేదా, ఆమె సోదరుడు నిఖిల్ కలిసి ఫొటోలు దిగారు ఈ ఫొటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసిని నిక్ నేమ్‌లతో ఆసక్తికర క్యాప్షన్ పెట్టాడు. ూమూడు హృదయాలు.. ఒక హ్యాపీ ఫ్రేమ్‌లో.. ఉప్మా.. నిక్కీ.. కుకీ.. అంటూ ముగ్గురు ముద్దు పేర్లు పోస్ట్ చేయడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఇండస్ర్టీలో పోటీ ఉన్నప్పటికీ, లాంగ్ ఫ్రెండ్‌షిప్‌ను కొనసాగించే హీరోయిన్లు వీరిద్దరూ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నివేదా థామస్ ‘శ్రీమతి’ సినిమాతో బిజీగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’ సినిమా చేస్తున్నారు.