ఫన్ ఫుల్‌గా 'అనుమాన పక్షి' కంటెంట్!
ABN, Publish Date - Mar 28 , 2026 | 11:03 AM
'డీజే టిల్లు' ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా 'అనుమాన పక్షి'. ఈ సినిమా కోసం రమణ గోగుల పాడిన గులాబ్ జామ్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాలకు ఇది 50వ చిత్రం కావడం విశేషం.
రాగ్ మయూర్ హీరోగా, డిజే టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అనుమాన పక్షి'. రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహనిర్మాత. తాజాగా మూవీ మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా నుంచి గులాబ్ జామ్ సాంగ్ లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల క్యాచి ట్యూన్‌గా కంపోజ్ చేసిన ఈ పాటని వెటరన్ సింగర్ రమణ గోగుల పాడిన తీరు కట్టిపడేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా 'దిల్' రాజు మాట్లాడుతూ, 'అనుమాన పక్షి సినిమా కంటెంట్ చాలా నచ్చింది. డైరెక్టర్ విమల్‌తో మేం ఒక సినిమా చేయాలనుకున్నాం. కొంత స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగింది. కాకపోతే అది మెటీరియలైజ్ కాలేదు. రాజీవ్‌తో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వాళ్ళది యానిమేషన్లో చాలా స్ట్రాంగ్ కంపెనీ. 'డిజె టిల్లు' తర్వాత మళ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ విమల్ రాసుకున్నాడు. మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో రోజూ అనుమాన పడుతూనే ఉంటాం. అలాంటి ఐడియాతో స్క్రిప్ట్ రెడీ చేశారు. రాగ్ మయూర్ చాలా టాలెంటెడ్. శ్రీచరణ్ 'నాంది, గూఢచారి, డి.జె. టిల్లు' లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా కంటెంట్ కొంత చూశాను. చాలా ఫన్ వుంది' అని అన్నారు.
హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ, 'నా కెరీర్ లో ఫస్ట్ సాంగ్ గులాబ్ జామ్! అది కూడా రమణ గోగుల లాంటి ఒక గొప్ప సింగర్ పాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. శ్రీచరణ్ ఈ పాట పాడి వినిపించినప్పుడు ఆయన అయితే బాగుంటుందని అనుకున్నాం. మేము బలంగా కోరుకున్నట్టే ఫైనల్ గా ఆయన వచ్చి పాడడం, ఆయన స్టూడియోలో పాడుతుంటే మాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఆయన ఈ పాటని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. అనుమాన పక్షి పూర్తిగా ఒరిజినల్ కంటెంట్. ఒక పూర్తి క్యారెక్టర్ ఫిల్మ్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కశ్మీర్‌లోనే చేశాం. పెహల్గవ్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ షూట్ చేసిన ఫస్ట్ సినిమా ఇది. రాశి గారితో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. అలాగే మెరీన్ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు' అని చెప్పారు.
డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా విషయంలో నా మీద నిర్మాత ఎలాంటి అనుమానం పెట్టుకోలేదు. కావలసినంత ఫ్రీడమ్ ఉండడం వల్ల ఈ సినిమా ఫాస్ట్ గా చేయగలిగాను. ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. దీంతో పాటు చిన్న సైక్లాజికల్ సస్పెన్స్ కూడా ఉంటుంది. కచ్చితంగా ధియేటర్లో ఒక ఫన్ రైడ్ లానే ఉంటుంది. డిజె టిల్లు కి ఎలా సపోర్ట్ చేశారో ఈ సినిమా కూడా అలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు. సీనియర్ హీరోయిన్ రాశి మాట్లాడుతూ, 'కథ విన్నాక ఎలాంటి అనుమానం లేకుండా ఒప్పుకున్నాను. కొన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడే హిట్ అవుతాయని కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా ఇది. రాగ్ మయూర్ చాలా మంచి హీరో అవుతాడు. ఈ సినిమా మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది' అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, 'అనుమానపక్షి నా 50వ సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా ఫన్ ఫిలిం. ఇలాంటి సినిమాలు చాలా ఇష్టపడతాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. 'డి జె టిల్లు' తర్వాత విమల్‌తో నాకిది సెకండ్ కొలాబరేషన్. రమణ గోగుల గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ సాంగ్ పడడం చాలా ఆనందాన్నిచ్చింది' అని తెలిపారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని హీరోయిన్ మెరీన్ చెప్పింది. తమ చిలక ప్రొడక్షన్స్‌లో ఇదే ఏడాది మరో సినిమాని కూడా రిలీజ్ చేస్తామని రాజీవ్ చిలకా అన్నారు. ఇదో బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని కో-ప్రొడ్యూసర్ భరత్ చెప్పారు.