New Multiplex: నగరంలో.. సరికొత్త హంగులతో మరో లగ్జరీ మల్టీప్లెక్సు! పెద్దితో ప్రారంభం
ABN, Publish Date - May 22 , 2026 | 10:09 AM
గడిచిన ఐదారేళ్ళలో హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య రోజురోజుకు తగ్గి మల్టీప్లెక్సుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
గడిచిన ఐదారేళ్ళలో హైదరాబాద్‌లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య రోజురోజుకు తగ్గి మల్టీప్లెక్సుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అత్యాధునిక టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకు వస్తూ ప్రేక్షకులకు అనునిత్యం కొత్తదనాన్ని, మంచి విజువల్ ఫీస్ట్ ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికే కోకాపేటలో అల్లు సినిమాస్ డాల్బీ సౌండ్‌తో మల్టీప్లెక్సు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓడియన్, వనస్థలి పురంలో ఏఆర్టీ, నాంపల్లిలో రుంగ్తా సినిమాస్ వంటివి ఓపెన్ అవగా ఈ మధ్యే ప్రసాద్ ఐమాక్స్ స్రీన్లను సైతం ఆధునీకరించారు. దీనితో పాటు అల్రెడీ ఉన్న అనేక మల్టీప్లెక్సులలో భారీ మార్పులు చేస్తున్నారు.
అయితే.. ఇప్పటికే రెండు పచ్చీస్‌లకు పైగా మల్టీప్లెక్సులు జంటనగరాల్లో విజయవంతంగా నడుస్తోండగా ఇప్పుడు మరో లగ్జరీ మల్టీప్లెక్సు ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్రమైన శంషాబాద్ (Shamshabad)లో అత్యాధునిక సౌకర్యాలు డాల్బీ అట్మాస్, 4కే, బార్కో లేజర్ వంటి ఫీచర్లతో అపర్ణ సినిమాస్ (Aparna Cinemas) మల్టీఫ్లెక్స్ ను నిర్మించింది.
మొత్తం ఏడు స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్సు జూన్ 3న మెగా పవర్ స్టార్ 'పెద్ది' సినిమాతో లాంఛనంగా స్టార్ట్ అవనుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్సుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త అపర్ణ రాకతో హైదరాబాద్ నలుమూలల మల్టీప్లెక్సులు వ్యాపించినట్లైంది.