సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్నపూర్ణ స్టూడియోస్.. పళ్లబురుసు టీజ‌ర్‌

ABN, Publish Date - Jul 29 , 2026 | 06:00 PM

బ‌ల‌గం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తమ పాత్రల్లో రూపొందిన రూర‌ల్ విలేజ్ డ్రామా చిత్రం పళ్లబురుసు.

pallaburusu

బ‌ల‌గం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తమ పాత్రల్లో రూపొందిన రూర‌ల్ విలేజ్ డ్రామా చిత్రం పళ్లబురుసు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ (EPIC Studios) సంయుక్తంగా నిర్మించాయి. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌లకు ముస్తాబ‌యింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకోగా తాజాగా బుధ‌వారం టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్లో ఒక చిన్న గొడవ కోర్టు మెట్లు ఎక్కడం, తండ్రి-కొడుకుల మధ్య జరిగే సంఘటనలు, గ్రామీణ పాత్రల సహజ సంభాషణలు టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎక్కడా అనవసర హడావిడి లేకుండా కథలోకి తీసుకెళ్లే విధంగా టీజర్‌ను కట్ చేశారు. పవన్ CH అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది. విజువల్స్ కూడా గ్రామీణ వాతావరణాన్ని అందంగా ఆవిష్కరించాయి. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో తెర‌కెక్కిన ఈ 'పళ్లబురుసు' చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - Jul 29 , 2026 | 06:01 PM