సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anna Lezhneva: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ భార్య

ABN, Publish Date - Jul 18 , 2026 | 09:42 AM

తన భర్త ఆరోగ్యం కుదుట పడాలని తిరుమల శ్రీనివాసుడికి మొక్కిన మొక్కును తీర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా

Anna Lezhneva

తన భర్త ఆరోగ్యం కుదుట పడాలని తిరుమల శ్రీనివాసుడికి మొక్కిన మొక్కును తీర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా (Anna Lezhneva).  ఇటీవల పవన్‌ (Pawan Kalyan) భుజానికి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీ విజయవంతంగా జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు.  అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి టీటీడీ అధికారులు అన్నా లెజినోవాకు  స్వాగతం పలికారు. శనివారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. 

 

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను  స్వీకరించారు.  ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా  అభిమానులతో పంచుకున్నారు. 'భక్తులతో కలిసి తిరుమల మెట్లు ఎక్కడం ఎంతో ఆనందంగా ఉంది. అలిపిరి మెట్ల మార్గంలో కాఫీ బ్రేక్ తో కలిపి నాలుగు గంటల్లో తిరుమల కొండకు చేరుకున్నాను.  ఆ ప్రయాణం కొంచెం కష్టమైనప్పటికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని' పేర్కొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 10:15 AM