వాళ్ల కోసం నేనెందుకు పెళ్లి చేసుకోవాలి..: అంజలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 01:52 PM

తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అంజలి. తాజాగా ఈ భామ తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

Actress Anjali

తెలుగు, తమిళ భాషల్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అంజలి (Anjali). నటనకు ఆస్కారమున్న పాత్రలతో పాటు కమర్షియల్ చిత్రాల్లోనూ మెప్పిస్తూ ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై తనదైన శైలిలో స్పందించారు. ఓ ఈవెంట్‌లో మాట్లాడిన ఆమె.. పెళ్లి, స్నేహితుల హడావుడి గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


పెళ్లి ప్రస్తావన రాగానే అంజలి చాలా కూల్‌గా, ఫన్నీగా బదులిచ్చారు. ‘‘అది నా పెళ్లి (Anjali Marriage).. నా జీవితం. నాకెప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటాను. అసలు పెళ్లి విషయంలో అంత తొందర ఎందుకు?’’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. ఇక తన ఫ్రెండ్స్ చేసే సందడి గురించి చెబుతూ.. ‘‘నిజం చెప్పాలంటే పెళ్లికూతురి కంటే నా ఫ్రెండ్స్‌కే పెళ్లి వేడుకలంటే ఎక్కువ ఇష్టం. రకరకాల డ్రెస్సులు వేసుకుని రెడీ అవ్వడం, ఫొటోషూట్లు దిగడం, పార్టీలు చేసుకుంటూ తెగ హడావుడి చేయడం వాళ్లకు మహా సరదా. వాళ్లు ముస్తాబై ఎంజాయ్ చేయడం కోసం నేనెందుకు తొందరపడి పెళ్లి చేసుకోవాలి?’’ అంటూ సరదాగా కౌంటర్ వేశారు.


సరైన సమయం వచ్చినప్పుడు తన వ్యక్తిగత విషయాలను తప్పకుండా పంచుకుంటానని స్పష్టం చేసిన అంజలి.. ప్రస్తుతం పూర్తి దృష్టిని సినిమాలపైనే పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సంచారి’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి చేసిన ఈ చమత్కారమైన వ్యాఖ్యలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

వెంకీ అట్లూరి క్రేజీ ప్లాన్.. అదిరిపోయే లైనప్‌ సిద్ధం

‘రామాయణ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. యశ్ విశ్వరూపం

ప్రియుడిని పెళ్లాడిన ఆర్జీవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Updated Date - Sep 28 , 2026 | 01:52 PM