వెంకీ అట్లూరి క్రేజీ ప్లాన్.. అదిరిపోయే లైనప్ సిద్ధం
ABN , Publish Date - Sep 28 , 2026 | 01:14 PM
కంటెంట్ ఓరియెంటెడ్ కథలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ తర్వాత వెంకీ లైనప్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
కంటెంట్ ఓరియెంటెడ్ కథలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). క్లాస్, మాస్ అనే తేడా లేకుండా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించి అదిరిపోయే లైనప్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ బజ్ నడుస్తోంది. గతంలో తాను పనిచేసిన స్టార్ హీరోలతోనే వరుసగా క్రేజీ కాంబినేషన్లను రిపీట్ చేసేందుకు వెంకీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
దుల్కర్‌తో ‘లక్కీ భాస్కర్ 2’.. ధనుష్‌తో కాప్ స్టోరీ
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తో కలిసి వెంకీ అట్లూరి రూపొందించిన ‘లక్కీ భాస్కర్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థ నేపథ్యంలో వచ్చిన ఆ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా ఇప్పుడు ‘లక్కీ భాస్కర్ 2’ (Lucky Baskhar 2) చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక గతంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)తో విద్యా వ్యవస్థ నేపథ్యంలో వెంకీ తీసిన ‘సార్’ (తమిళంలో ‘వాతి’) చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ధనుష్‌తో జతకడుతూ.. ఈసారి పూర్తిస్థాయి కమర్షియల్ కాప్ డ్రామాను తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన ఆరాధ్య హీరో సూర్యతోనూ మరో మూవీ!
వీటితో పాటు, తనకు అత్యంత ఇష్టమైన ఆరాధ్య కథానాయకుడు సూర్య (Suriya)తో కూడా వెంకీ అట్లూరి మరో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నారట. వైవిధ్యమైన కథలతో పాటు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ హిట్లు కొడుతున్న దర్శకుడు కావడంతో ఈ స్టార్ హీరోలంతా వెంకీతో పనిచేయడానికి పూర్తి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. వెరైటీ కాన్సెప్టులతో స్టార్ హీరోలను సరికొత్త కోణంలో ప్రజెంట్ చేయడంలో వెంకీ అట్లూరి సిద్ధహస్తుడు. ఒకేసారి దుల్కర్ సల్మాన్, ధనుష్, సూర్య లాంటి పాన్-ఇండియా స్టార్లతో కాంబినేషన్లు రిపీట్ కాబోతున్నాయన్న వార్త సినీ ప్రియుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
‘రామాయణ’ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. యశ్ విశ్వరూపం
ప్రియుడిని పెళ్లాడిన ఆర్జీవీ హీరోయిన్.. ఫొటోలు వైరల్
దాదా.. బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్