Anil Ravipudi: ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి మార్క్.. ‘దళపతి’ సీన్‌తో సర్ప్రైజ్!
ABN, Publish Date - Nov 19 , 2026 | 11:52 AM
తన సినిమా కంటెంట్‌ను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి. సినిమా ప్రమోషన్ల విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి.
తన సినిమా కంటెంట్‌ను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో బాగా తెలిసిన దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). సినిమా ప్రమోషన్ల విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. ప్రమోషన్ల ప్రణాళికకు సృజనాత్మకతను జోడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంటారు. ప్రస్తుతం వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కీలక పాత్రధారులుగా ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి సినిమా ప్రమోషన్లను షురూ చేశారు. ఇప్పటికే ఆయన విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్ర మ్యూజికల్ జర్నీకి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దీని కోసం మణిరత్నం క్లాసిక్ చిత్రం ‘దళపతి’లో రజనీకాంత్, శోభన మధ్య వచ్చే హృద్యమైన సన్నివేశాలను అనిల్ రావిపూడి, కృతిశెట్టిపై రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా.. రీల్స్‌కు విపరీతంగా అలవాటు పడిన ఆడోళ్లకు మళ్లీ కొత్త రీల్ కంటెంట్ ఇచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఆసక్తికరమైన రీక్రియేషన్ ఎలా ఉందో మీరూ చూసేయండి...