Anil Ravipudi: మ్యూజిక్ డైరెక్టర్‌ను పాతిపెట్టిన అనిల్ రావిపూడి.. ఇలా కూడా చేస్తారా?
ABN, Publish Date - Jun 12 , 2026 | 04:13 PM
‘ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ వేరయా’ అంటారు ఇండస్ట్రీ జనాలు. ఆయన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే విధానం అలా ఉంటుంది మరి.
‘ప్రమోషన్స్‌లో అనిల్ రావిపూడి ప్రమోషన్స్ వేరయా’ అంటారు ఇండస్ట్రీ జనాలు. ఆయన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే విధానం అలా ఉంటుంది మరి. ఆయన తీసే ప్రతి సినిమా ప్రచారం కొత్తగానే ఉంటుంది. అసలు ప్రమోషన్స్‌కే రాని నయనతారతో కూడా ఓ వీడియో చేయించి వైరల్ చేసిన ఘనత అనిల్ రావిపూడిది. ప్రస్తుతం ఆయన వెంకటేశ్-కల్యాణ్‌రామ్ కీలక పాత్రధారులుగా ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా సినిమా షూటింగ్ మొదలుకాక ముందే ప్రచారం మొదలెట్టేశారు అనిల్. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఈ విషయాన్ని చెబుతూ ఓ వింత చేష్ట చేశారు అనిల్ రావిపూడి. ఈ సినిమా ప్రమోషన్ కోసం ‘వివాహ భోజనంబు’లో బ్రహ్మానందాన్ని ఇసుకలో పూడ్చి.. హైదరాబాద్.. సికింద్రాబాద్.. అదిలాబాద్ అంటూ సుత్తి వీరభద్రరావు చేసిన కామెడీ సీన్ ను అనిల్ రావిపూడి రీ క్రియేట్ చేశారు. ఇక్కడ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి సినిమా పాటలు ఎలా ఉండాలో చెబుతూ 'క్లాసు పాట.. మాసు పాట.. ఎమోషనల్ పాట, మెలోడీ పాట...డీజే పాట.. బీజీఎమ్ పాట' అంటూ ఓ వీడియో చేశారు.
ట్యూన్ కట్టాలంటే హార్మొనీ ఉంటే సరిపోదు.. రెండు చేతులు.. పది వేళ్ళు కూడా కావాలి.. కనీసం చేతులైన బయటకు తీయండి మహాప్రభో’ అంటూ జీవీ చెప్పడం, లిరిక్ రైటర్ గురించి అడిగితే ‘రెండు రోజుల ముందే అతడిని పాతిపెట్టా’ అంటూ అనంత్ శ్రీరామ్‌ను చూపించడం నవ్వుల పువ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'ప్రమోషన్స్‌లో నిన్ను కొట్టేవాడు లేడయ్యా అనిల్' అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీరూ ఈ వీడియో చూసేయండి.. .