తెలుగులో అబ్బాస్ రీ ఎంట్రీ.. ఏ సినిమాతోనో తెలుసా
ABN, Publish Date - Nov 29 , 2026 | 06:56 PM
90వ దశకంలో ప్రేమదేశం చిత్రంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన అబ్బాస్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక అబ్బాస్ కటింగ్ తో అప్పటి యూత్ చేసిన రచ్చ ఇప్పటికీ ఇంట్లో పెద్దవారు మాట్లాడుతూనే ఉంటారు.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ తెలుసు. క్రింజ్ కామెడీ అయినా.. లేక స్టార్ హీరోలతో చేయించే కామెడీ అయినా కూడా ఇంటిల్లపాదీ కూర్చొని నవ్వుకొనేలా ఉంటాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడిల్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆయన టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాడు. వారు కొత్తవారైనా.. లేక పాతవారైనా సరే. తన సినిమాకి వారు హైలైట్ అయితే మాత్రం ఈమాత్రం ఆలోచించడు. కథలో బలమైన ఎమోషన్, వినోదంతో పాటు ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చే కాస్టింగ్‌ను సెట్ చేయడంలో దర్శకుడు అనిల్ రావిపూడి శైలే వేరు. పాత తరం నటులను నేటి తరం కథలకు తగ్గట్టుగా మలచడంలో ఆయన ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటాడు. తాజాగా జనవరి 12 విడుదల సినిమా కోసం ఒక సీనియర్ హీరోని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు ఒకప్పటి యూత్ ఐకాన్ అబ్బాస్.
90వ దశకంలో ప్రేమదేశం చిత్రంతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన అబ్బాస్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక అబ్బాస్ కటింగ్ తో అప్పటి యూత్ చేసిన రచ్చ ఇప్పటికీ ఇంట్లో పెద్దవారు మాట్లాడుతూనే ఉంటారు. లవర్ బాయ్ ఇమేజ్‌తో దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అబ్బాస్, కొన్నేళ్ల పాటు వెండితెరకు విరామం ప్రకటించి వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టిన విషయం తెల్సిందే. ఆ తరువాత తమిళ్ లో జీవి ప్రకాష్ కుమార్ నటించిన హ్యాపీ రాజ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా తమిళ్ లో అబ్బాస్ కి మాత్రం మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందించింది.
ఇక ఇప్పుడు అబ్బాస్.. జనవరి 12 విడుదల సినిమాతో తెలుగులో కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో అబ్బాస్ కోసం అనిల్ రావిపూడి ఒక మంచి పాత్ర రాశాడట. కేవలం అతిథి పాత్రలా కాకుండా, కథ గమనాన్ని ప్రభావితం చేసే ప్రాధాన్యత కలిగిన రోల్‌ను ఆయన కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వయసు పెరిగినా తరగని ఆకర్షణ, హుందాతనంతో కనిపిస్తున్న అబ్బాస్.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని తెలుగులో చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. ఇదే కాకుండా మరో రెండు సినిమాలకు అబ్బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఒకవేళ జనవరి 12 విడుదల సినిమాలో అబ్బాస్ పాత్ర పండితే మాత్రం ఆయన రేంజ్ వేరేలా మారిపోతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి అబ్బాస్ రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.