సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వారెవ్వా అనిల్‌ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!

ABN, Publish Date - Jun 13 , 2026 | 03:19 PM

ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒకెత్తయితే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, అంటే ప్రమోట్ చేయడం అనేది మరో ఎత్తు. అలాంటి టాస్క్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఈజీగా పూర్తి చేస్తూ.. ఆయన సినిమాలపై భారీ హైప్‌ని పెంచుతున్న విషయం తెలిసిందే.

Anil Ravipudi

ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒకెత్తయితే.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం, అంటే ప్రమోట్ చేయడం అనేది మరో ఎత్తు. సినిమా బాగుంటే సరిపోదు, ఆ సినిమా థియేటర్లలోకి వస్తోందనే విషయం ప్రేక్షకులకు బలంగా రీచ్ అవ్వాలి. అందుకే ఇప్పుడున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు అందరూ కూడా ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, సినిమాలను ప్రమోట్ చేయడంలో కొత్త ట్రెండ్స్ సెట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ అనే రేసులో అందరికంటే చాలా ముందంజలో ఉండే పేరు.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలు పాన్ ఇండియా దాటి గ్లోబల్ లెవెల్‌లో అంతటి సంచలనం సృష్టించాయంటే, దానికి జక్కన్న చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్ ఒక ముఖ్య కారణం. ఇక వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోయే ‘వారణాసి’ విషయంలోనూ ఈ ప్రమోషన్స్‌ ద్వారానే ఆడియెన్స్‌కు కావాల్సినంత అటెన్షన్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా.. ప్రతి భాషా ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తూ సినిమాపై ఊహించని హైప్‌ను క్రియేట్ చేయడంలో రాజమౌళి దిట్ట.


సరిగ్గా ఇదే కేటగిరీలో దూసుకుపోతోన్న మరో క్రేజీ కమర్షియల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే... అది అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాత్రమే! ‘పటాస్’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈయన, రీసెంట్‌గా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) వరకు ప్రతి సినిమాకూ తనదైన శైలిలో ప్రమోషన్స్ చేస్తూ హైప్ పెంచుకుంటూ వస్తున్నారు. అసలు ప్రమోషన్లకే రాని లేడీ సూపర్ స్టార్ నయనతారతోనే ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాకు ప్రమోషన్స్‌ చేయించి ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద షాక్ ఇచ్చారు అనిల్ రావిపూడి. రొటీన్‌గా ప్రెస్ మీట్లు పెట్టడం, ట్రైలర్లు వదలడం లాంటివి కాకుండా.. కాస్త వెరైటీగా, వినోదాత్మకంగా ప్రమోషన్స్ చేయడం అనిల్ రావిపూడి స్పెషాలిటీ. ఇప్పుడు తాజాగా ఆయన విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram)ల కాంబినేషన్‌లో ఒక క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే, అప్పుడే ప్రమోషన్స్ ఆట మొదలుపెట్టేశారు! అదీ హాస్య బ్రహ్మ జంధ్యాల మార్క్ కామెడీ స్టైల్‌లో కావడం విశేషం.


రీసెంట్‌గా ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్, అలానే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్‌ను వైజాగ్ బీచ్ ఇసుకలో మెడ వరకు కప్పెట్టేసి... అనిల్ రావిపూడి వారితో వెరైటీగా మాట్లాడించారు. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. సినిమా ఓపెనింగ్ అప్‌డేట్‌ను ఇంత క్రేజీగా ఇవ్వడం బహుశా టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కావచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ లవ్ చేసే విక్టరీ వెంకటేష్, మరోవైపు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఇద్దరి కాంబోనే ఒక పెద్ద సర్‌ప్రైజ్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ నెల నుంచే షూటింగ్ స్టార్ట్ చేసి, రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలనే పక్కా ప్లానింగ్‌తో అనిల్ రావిపూడి స్పీడ్ పెంచేశారు. టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అంటే అనిల్ రావిపూడికి ఎంతటి సెంటిమెంటో, ఎలాంటి సక్సెస్ రేట్ ఉందో తెలియంది కాదు. మరి సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే ఇంతటి వెరైటీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన అనిల్ రావిపూడి.. ఇక టీజర్, ట్రైలర్, సినిమా రిలీజ్ సమయానికి ఇంకెలాంటి కొత్త వెరైటీలు చూపిస్తారో, ప్రేక్షకులను ఎలా సర్‌ప్రైజ్ చేస్తారో చూడాలి!

ఇవి కూడా చదవండి:

Samantha: సమంత ‘లేడీ బాషా’.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?

ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి!

ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా

Updated Date - Jun 13 , 2026 | 03:25 PM