సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ రావిపూడి.. భ‌లే షాక్ ఇచ్చాడుగా! వెంక‌టేశ్‌, కళ్యాణ్ రామ్‌ల‌తో మూవీ

ABN, Publish Date - Feb 26 , 2026 | 08:02 PM

రెండు నెల‌లుగా అనిల్ నెక్ట్స్ సినిమా గురించి సోష‌ల్‌మీడియాలో ఓ రేంజ్‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ఎట్ట‌కేల‌కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

Anil Ravipudi

చిరంజీవితో మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు అంటూ థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) త‌ర్వాతి సినిమాపై అప్డేట్ వ‌చ్చింది. రెండు నెల‌లుగా అనిల్ నెక్ట్స్ సినిమా గురించి సోష‌ల్‌మీడియాలో ఓ రేంజ్‌లో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ఎట్ట‌కేల‌కు ఈ మూవీ నుంచి ఆస‌క్తికర విష‌యాల‌ను డైరెక్ట‌ర్ అనిల్ వెల్ల‌డించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

త్వ‌ర‌లోనే వెంక‌టేశ్ (Venkatesh Daggubati), క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)ల‌తో క‌లిసి సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 'తనకు తొలి 100 కోట్ల సినిమా ఇచ్చిన వెంక‌టేశ్‌, తొలి సినిమా ఛాన్స్ ఇచ్చిన క‌ల్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో ఈ సినిమా ఉంటుంద‌ని, వ‌చ్చే సంక్రాంతి (SANKRANTHI 2027) కి ప్రేక్ష‌కుల ఎదుట‌కు ఈ సినిమాను తీసుకు వ‌స్తామ‌ని అధికారికంగా తెలుపుతూ, ఓ చిన్న గ్లిమ్స్ సైతం రిలీజ్ చేశారు.

గ‌త కొన్ని రోజులుగా వెంక‌టేశ్‌తో సినిమా ఉంటుంద‌ని, మ‌ల‌యాళ స్టార్ ఫాహ‌ద్ ఫాజిల్ కీ-రోల్ చేస్తున్నాడ‌ని, కీర్తి సురేశ్ క‌థానాయిక‌గా చేస్తోంద‌ని, దానికి 'బామ్మర్ది బాల్ రెడ్డి' అనే టైటిల్ ఫైన‌ల్ అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కాగా ఇన్నాళ్లు జ‌రిగిన‌ట్లు ఫ‌హాద్ కాకుండా ఆయ‌న స్థానంలో క‌ల్యాణ్ రామ్ వ‌చ్చిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక హీరోయున్‌, సినిమా టైటిల్ విష‌యంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే. నందమూరి - కొణిదెల - అక్కినేని కుటుంబ హీరోలతో కలిసి న‌టించిన‌, నటిస్తున్న ఏకైక హీరోగా దగ్గుబాటి వెంకటేష్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు.

Updated Date - Feb 26 , 2026 | 11:33 PM