సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anil Ravipudi: నువ్వు బజారోడివి కాదు.. అనిల్ రావిపూడి వ్యాఖ్యలు వైరల్

ABN, Publish Date - Jan 10 , 2026 | 09:43 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu).

Anil Ravipudi

Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తూ ఉన్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించాడు. అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ ఉంటాయని, కామెడీ లేకపోయినా కుటుంబాలు మాత్రం బాగా కనెక్ట్ అవుతాయని ట్రోల్స్ వచ్చాయి. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీలకు తప్ప యువతకు నచ్చలేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి సినిమాలు తీయడం ఆపేయ్ అనిల్ అని కూడా కామెంట్స్ చేశారు.

ఇక ఆ సమయంలోనే ఒక మీమ్ వైరల్ అయ్యింది. అందులో ఒక కుర్రాడు సంక్రాంతికి వస్తున్నాం యావరేజ్ గురు అంటే.. పక్క కుర్రాడు అవును బావా.. ఫ్యామిలీకి ఎక్కేస్తుంది అని చెప్తాడు. వెంటనే మొదటి కుర్రాడు.. అంటే ఏంట్రా నేను బజార్ నా కొడుకుని అనుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతాడు. ఈ మీమ్ చాలా వైరల్ అయ్యింది. చివరికి అనిల్ సైతం ఈ మీమ్ చూసి నవ్వుకున్నట్లు తెలిపాడు.

ఈ మీమ్ గురించి అనిల్ సరదాగా స్పందించాడు. ' ఫ్యామిలీ జోనర్ అంటే అందులో యంగ్ స్టర్స్ కూడా ఉంటారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సమయంలో నేను బజారోడినా అనే మీమ్ చూసి తెగ నవ్వుకున్నాను. అరేయ్ బాబు నువ్వు కూడా ఫ్యామిలీయే.. నీ ఫ్యామిలీతో నువ్వు వెళ్ళినప్పుడు.. నీ తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలి నువ్వు కూడా ఉన్నావ్.. నువ్వు బజారోడివి కాదు. ఆ సినిమాలో మీనాక్షీకి యూత్ కనెక్ట్ అవుతారు.సీనియర్స్ చేయడం వలన కథ కనెక్ట్ కాకపోవచ్చు కానీ, ఫన్ ఎంజాయ్ చేస్తారుగా.

నేను చిన్నప్పుడు అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలకు వెళ్లాను. ఆ సమయంలో నేను చిన్నోడిని.. నా పేరెంట్స్ పెద్దోళ్ళు కదా. నేను వాళ్ళతో వెళ్లి చూసాను కదా సినిమా. నాకు నాస్టాలీజియా ఫీలింగ్స్ కదా అవన్నీ. క్లీన్ మైండ్ తో తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళండి. ఎంజాయ్ చేయండి. ఏ జోనర్ అయితే మీకెందుకు. అమ్మానాన్నలతో కలిసి సినిమా చూడు. వాళ్లకేం నచ్చిందో వాళ్ళు తీసుకుంటారు. నీకేం నచ్చిందో నువ్వు చూడు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంటే అందరూ వస్తారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 10 , 2026 | 09:43 PM