సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నీల్ మావా.. ఈసారి ఆగేదే లేదు

ABN, Publish Date - Aug 06 , 2026 | 07:17 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా డ్రాగన్(Dragon) పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Dragon

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా డ్రాగన్(Dragon) పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కు ఊహించని అడ్డంకులు ఎదురవుతూనే వస్తున్నాయి. మొన్నటివరకు ఏవేవో కారణాలతో డ్రాగన్ షూట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక అంతా సవ్యంగా జరుగుతుంది అనుకొంటున్న సమయంలో ఎన్టీఆర్ భుజానికి మరొకసారి గాయం కావడంతో వైద్యులు ఆయనకు ఆరేడు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో డ్రాగన్ కి మళ్లీ బ్రేకులు పడ్డాయి.


అయితే.. ఈసారి ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా ఆలోచించాడు.ఏదిఏమైనా షూటింగ్ మాత్రం ఆగేదే లేదు అంటున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ వెనక్కి వెళ్తూ వస్తోంది. ఈసారి ఎలాగైనా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ వేశారు. ఆ డేట్ కి డ్రాగన్ రావాలంటే కచ్చితంగా షూటింగ్ కి ఇప్పుడు గ్యాప్ ఇవ్వకూడదు. అరే ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ ఎలా అంటే.. ఎన్టీఆర్ కోలుకునే లోగా ఆయన అవసరం లేని కీలక సన్నివేశాలను పూర్తి చేయడానికి ప్రశాంత్ నీల్ రంగం సిద్దం చేశాడు. ఇందులో భాగంగానే బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ముంబై నుండి రామోజీ ఫిల్మ్ సిటీలోని సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ఇండియన్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ గా అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ని ప్రత్యక్షంగా ఢీకొట్టే ప్రధాన ప్రతినాయక పాత్ర ఇది అని టాక్ నడుస్తోంది.


ఇక 1980లో బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోనే ప్రస్థానం ప్రారంభించిన అనిల్ కపూర్, దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో తన సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం విశేషం. ప్రశాంత్ నీల్ సమయస్ఫూర్తితో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ద్వారా సినిమా నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందని చిత్రబృందం భావిస్తోంది. మరి ఈ సినిమాతో అనిల్ కపూర్ తెలుగువారిని ఎలా అలరించనున్నాడో చూడాలి.

Updated Date - Aug 06 , 2026 | 07:17 PM