46 ఏళ్ళు.. ఆంటీ కాక అమ్మాయివా
ABN, Publish Date - May 03 , 2026 | 08:12 PM
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham).. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆమె ఒకపక్క నటిగా.. ఇంకోపక్క యాంకర్ గా కొనసాగుతున్నారు.
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautham).. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఆమె ఒకపక్క నటిగా.. ఇంకోపక్క యాంకర్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా రష్మీ జంతు ప్రేమికురాలు. మూగజీవాలను హింసిస్తే ఎంతటివారినైనా నిలదీస్తారు. గత కొన్నిరోజులుగా రష్మీ సోషల్ మీడియాలో మూగ జీవాల హింస గురించి పోరాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును కిర్రెక్కించే రష్మీ తాజాగా ఒక ఆంటీ ఫోటోను షేర్ చేశారు.
బూరె బుగ్గలు వేసుకొని, బొద్దుగా ఉన్న మహిళ ఫోటోను షేర్ చెసి ఆంటీ అని క్యాప్షన్ పెట్టారు. సడెన్ గా చూసి ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ, తీక్షణంగా చూస్తే అది రష్మీనే అని తెలుస్తుంది. తన ఫోటోను ఫిల్టర్ల ద్వారా ఇలా బొద్దుగా మార్చి దానికి ఆంటీ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన ఒక నెటిజన్.. నా చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్నావ్.. 46 ఏళ్ళు ఉన్న నువ్వు ఆంటీ కాకా అమ్మాయివా అని కామెంట్ చేశాడు. ఇంకొక నెటిజన్ ఆంటీ ఉంది.. మరి అంకుల్ ఎక్కడ అని రిప్లై ఇచ్చాడు. నిజానికి రష్మీ వయస్సు 38 ఏళ్ళే. ఇప్పటివరకు ఈ చిన్నది పెళ్లి చేసుకోలేదు. మరి వచ్చే ఏడాదిలో పెళ్ళి చేసుకొని నిజంగానే ఆంటీలా మారుతుందేమో చూడాలి.