సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Murali Sharma: అనసూయ కారణజన్మురాలు.. ఆమెకు గుడి కడతా

ABN, Publish Date - Jan 27 , 2026 | 05:38 PM

యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అనసూయ పేరు మారు మ్రోగుతోన్నవిషయం తెల్సిందే.

Murali Sharma

Murali Sharma: యాంకర్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అనసూయ పేరు మారు మ్రోగుతోన్న విషయం తెల్సిందే. నటుడు శివాజీ (Shivaji).. ఆడవారి దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక ఆ వివాదంలో అనసూయ సైతం తన అభిప్రాయాన్ని తెలియజేసి విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే ఈ వివాదం సద్దుమణుగుతున్న సమయంలో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీ శర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మురళీ శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్స్ ఖుష్బూ, సమంత, నమితకు కట్టినట్లు అనసూయకు కూడా గుడి కడతానని చెప్పి షాక్ ఇచ్చాడు. అనసూయ అనుమతి తీసుకొని మరీ ఈ గుడిని కట్టిస్తామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరాడు. అంతేకాకుండా ఆ గుడికి పూజారులు ఎవరూ ఉండాల్సిన అవసరం లేదని, ప్రేమతో అక్కడ ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు అని తెలిపాడు.

' అనసూయ కారణజన్మురాలు.. ఆమె గురించి తెలుసుకుంటే ఎవరైనా అభిమానులు అవుతారు. అనసూయకు లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఆమె ఏం చెప్తే మేము అది చేస్తాం. ఏ విషయంలో అయినా ఆమెకు సపోర్ట్ ఇస్తాం. అనసూయ ఐడియాలజీ నాకు నచ్చుతుంది. ఆమె ఒప్పుకుంటే అభిమానులందరం కలిసి గుడి కడతాం. త్వరలోనే అభిమానులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడ గుడి నిర్మిస్తే బాగుంటుందో నిర్ణయిస్తాం' అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Jan 27 , 2026 | 06:01 PM