సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anasuya: అత్యాచార కేసులో 40 మంది ఎంపీలు.. ఇది మన భారతదేశం

ABN, Publish Date - Jan 18 , 2026 | 09:31 PM

హాట్ యాంకర్ అనసూయ (Anasuya) కావాలనే వివాదాలు ఉన్న చోట వెళ్లి ఇరుక్కుంటుందో.. లేక అవే అనసూయను వెతుక్కుంటూ వస్తాయో తెలియడం లేదు.

Anasuya

Anasuya: హాట్ యాంకర్ అనసూయ (Anasuya) కావాలనే వివాదాలు ఉన్న చోట వెళ్లి ఇరుక్కుంటుందో.. లేక అవే అనసూయను వెతుక్కుంటూ వస్తాయో తెలియడం లేదు. మొన్నటికి మొన్న శివాజీ (Shivaji) డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఏరికోరి ఆమె వివాదాన్ని మొదలుపెట్టింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానగా మారి.. చివరకు ఆమెనే ముంచేసింది. స్వేచ్ఛ, సమానత్వం, ఆడవారికి ఉండాలని పోరాటం చేస్తూ.. మా బట్టలు మా ఇష్టం అంటూ గొంతు ఎత్తింది. ఇక ఇప్పటికే సింగర్ చిన్మయి ఇలాంటి పోరాటాన్ని నడిపిస్తుండడంతో.. వీరిద్దరిని నెటిజన్స్ ఏకిపారేయడం మొదలుపెట్టారు. కొందరు వీరికి సపోర్ట్ గా నిలబడినా.. చాలావరకు వీరికి విరుద్ధంగానే నిలబడ్డారు.

ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా చిన్మయి.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో 'దాదాపు 40 మంది ఎంపీలు ప్రస్తుతం అత్యాచార కేసులను ఎదుర్కొంటున్నందున అత్యాచారానికి మరణశిక్ష విధించే బిల్లు ఆమోదించబడలేదు' అన్న క్లిప్ ఉంది. ఇక ఈ క్లిప్ ను షేర్ చేసిన చిన్మయి.. దండం అనే ఎమోజీలు పెట్టుకొచ్చింది. ఈ పోస్ట్ కు అనసూయ తనదైన రీతిలో రిప్లై ఇచ్చింది.

' ఇదే మన భారతదేశం .. మనం యెంచుకున్న నేతలు నడిపే బారతదేశం. చాలా దూరం కదా దారి.. మనం బట్టల దగ్గర ఆగిపోయాం' అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు దీనిమీద కూడా పెద్ద చర్చ జరిగేలా కనిపిస్తుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. చిన్మయికి సపోర్ట్ చేస్తూ నువ్వు కూడా ఆమెలా మారిపోతున్నావని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ పోస్ట్ ఎన్ని వివాదాలకు దారితీస్తుందో చూడాలి.

Updated Date - Jan 18 , 2026 | 09:31 PM