సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anasuya: నీతులు తరువాత.. ముందు నువ్వు బొట్టు పెట్టుకో.. నెటిజన్స్ ఫైర్

ABN, Publish Date - Aug 23 , 2026 | 05:55 PM

అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, నటన గురించి పక్కన పెడితే.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నా అంటుంది అనసూయ.

Anasuya Bharadwaj

అందాల భామ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, నటన గురించి పక్కన పెడితే.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేనున్నా అంటుంది అనసూయ. లేదు అంటే వివాదాన్ని కావాలని కొనితెచ్చుకుంటుంది. ఇప్పటికే ఆమె ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. మొన్నటికి మొన్న 'జై శ్రీరామ్' నినాదంపై చేసిన వ్యాఖ్యల వివాదం పూర్తిగా సమసిపోకముందే మరో వివాదాన్ని తీసుకొచ్చిపెట్టింది. తాజాగా మహిళల కట్టు-బొట్టుపై అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భర్త చనిపోయాక ఆడవారు బొట్టు, గాజులు తీయడంపై ఆమె ఒక వీడియో ద్వారా పలు అనుమానాలను వ్యక్తపరిచింది.


ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. తన చిన్నప్పటి నుంచి తల్లి కాటుక, బొట్టు, తలలో పూలు, చేతులకు గాజులు ధరించి ఎంతో నిండుగా, అందంగా కనిపించేదని గుర్తుచేసుకుంది. కానీ, మూడేళ్ల క్రితం తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లి ఆ అలంకరణలన్నింటికీ దూరంగా ఉండటం తనను ఎంతగానో బాధించిందని, ఆడపిల్ల పుట్టగానే అమ్మ, అమ్మమ్మలు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకారాలను ఎంతో ఇష్టంగా నేర్పిస్తారని.. జీవితంలో భాగమైన ఆ సంప్రదాయాలను పెళ్లి తర్వాత కేవలం భర్తతో మాత్రమే ఎందుకు ముడిపెడతారని ఆమె ప్రశ్నించింది. ఒకవేళ అలంకారాలను దూరం చేయాల్సి వస్తే అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి కానీ, భర్త చనిపోగానే బొట్టు, గాజులు తొలగించాలనే నిబంధన ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. అసలు ఇలాంటి ఆచారాలు ఎవరు తీసుకొచ్చారని, అవన్నీ ఆడవారి వ్యక్తిగత ఇష్టాలని తెలిపింది. ఇవే కాకుండా ఇంకా చాలా రూల్స్ ఉన్నాయని.. పూజలకు, శుభకార్యాలకు భర్త చనిపోయినవారు రాకూడదని చెప్తారు.. ఇవన్నీ ఎవరు.. ఎక్కడ రాశారని అంటూనే.. ఇవన్నీ ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదని, తనలో ఉన్న అనుమానాలు మాత్రమే అని చెప్పి షాక్ ఇచ్చింది.


ఇక ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నెటిజన్లు అనసూయ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, మహిళలకు తమ అలంకరణ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొందరు నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వీడియోలో అనసూయ స్వయంగా నుదుట బొట్టు లేకుండా కనిపించడాన్ని వేలెత్తి చూపుతూ.. భర్త బతికుండగానే బొట్టు పెట్టుకోకుండా ఉన్న మీరు సంప్రదాయాల గురించి మాట్లాడటం ఏంటని విమర్శిస్తున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 06:01 PM