ఎల్లమ్మకు హీరోయిన్ దొరికిందిరోయ్.. దేవి పక్కన పర్ఫెక్ట్ జోడీ
ABN, Publish Date - Aug 31 , 2026 | 09:48 PM
'బలగం' వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్‌తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తరువాత సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది.
'బలగం' వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్‌తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తరువాత సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజునే వేణు సెకండ్ సినిమాను కూడా నిర్మిస్తానని చెప్పడమే కాకుండా.. దానికి ఎల్లమ్మ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ ఫిక్స్ అయినా హీరోలను వెటకడానికే సమయం పట్టింది. నాని దగ్గర నుంచి మొదలుపెట్టి.. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్.. ఇలా అందరి పేర్లు వినిపించి చివరకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన దేవిశ్రీ ప్రసాద్ పోస్టర్ మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.
ఇక ఇక్కడతో అయిపోయిందా అంటే.. హీరోయిన్ కోసం దిల్ రాజు చక్కర్లు కొడుతున్నట్లు టాక్ నడిచింది. కీర్తి సురేష్ అని కొందరు.. ఆ హీరోయిన్.. ఈ హీరోయిన్ అని రకరకాల పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో పేరు తెరమీదకు వచ్చింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ సరసన కథానాయికగా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ ఎంపికైనట్లు సమాచారం. ‘మ్యాడ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక 8 వసంతాలు సినిమాతో విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఇక అనంతికపై దర్శకుడు వేణు యెల్దండి ప్రత్యేక టెస్ట్ షూట్, ఫోటోషూట్ నిర్వహించారట. ఆమె నటన, లుక్స్ పట్ల దర్శకుడు వేణు,నిర్మాత దిల్‌రాజు ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, పవర్‌ఫుల్ ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో దేవి సరసన అనంతిక అయితే పర్ఫెక్ట్ ఛాయిస్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవైపు సంగీత దర్శకుడిగా స్టార్ హీరోల సినిమాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ ఇస్తూనే, మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్న దేవిశ్రీ ప్రసాద్ – వేణు యెల్దండి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.