సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anantha Sriram: ఆ పాట రాయడానికి యాభై రోజులు పట్టింది

ABN, Publish Date - May 23 , 2026 | 07:34 AM

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది' (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రత్యేక గీతాన్ని రామ్ చరణ్, శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు.

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ 'పెద్ది' (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రత్యేక గీతాన్ని రామ్ చరణ్, శ్రుతి హాసన్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించారు. ఈ పాటను ఈ రోజు భోపాల్ లో జరిగే  ఈవెంట్ లో విడుదల చేయనున్నారు. అనంత్ శ్రీరామ్ రచించిన  ఈ గీతాన్ని  సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన బృందం ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. 

ఈ సందర్భంగా అనంత్ శ్రీరామ్  మాట్లాడుతూ 'ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా  తెలుగులో 30 పాటలు రాశాను. ప్రతి పాట కొత్తగానే ఉంటుంది. ప్రయోగాలకు ఎప్పుడూ పెద్ద పీట వేసే రెహమాన్  'పెద్ది' చిత్రంలో కూడా ఓ కొత్త తరహా ప్రయత్నం చేశారు. ఐటెం సాంగ్ రాయడానికి ఇలాంటి బాణీలు కూడా ఇవ్వొచ్ఛా  అని మేమంతా ఆశ్చర్యపోయాం. ఈ ప్రత్యేక గీతం రాయడానికి నాకు. 50 రోజులు పట్టిందంటే నమ్మండి' అని తెలిపారు. 'బావా చీర.. చొక్కా  చిక్కడిపోవాలోయ్' అంటూ ఈ ప్రత్యేక గీతం సాగుతుంది. బుచ్చిబాబు సాన  దర్శకత్వంలో వెంకట సతీశ్ కిలారు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 4న సినిమా విడుదల కానుంది. 

Updated Date - May 23 , 2026 | 07:50 AM