సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ముందుగానే.. ‘గరివిడి లక్ష్మి’ ప్రీమియర్స్‌

ABN, Publish Date - Oct 14 , 2026 | 09:51 AM

ఆనంది ప్రధాన పాత్రలో గౌరి నాయుడు తెరకెక్కించిన ‘గరివిడి లక్ష్మి’ అక్టోబర్ 17న విడుదల కానుంది. సినిమా విజయంపై టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేయగా, ‘ది రాజాసాబ్’ విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Garividi Lakshmi

గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) చిత్రాన్ని మొదట మా అమ్మాయి ప్రారంభించింది. ఇప్పటి వరకూ సినిమాను చూసిన వారందరూ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమాపై నమ్మకంతో ముందుగానే ప్రీమియర్స్. వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకముంది' అని అన్నారు టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad).

ఆనంది (Anandhi) లీడ్ రోల్ లో గౌరి నాయుడు (Gowri Naidu Jammu) తెరకెక్కించిన చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ (Krithi Prasad) నిర్మించారు. సినిమా ఈనెల 17న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ నిర్వహించారు. హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ 'సినిమా చూసిన అందరూ తెర మీద పూర్తిగా గరివిడి లక్ష్మి పాత్రే కనిపించిందని చెప్పారు. ఒక నటిగా అది నాకు చాలా సంతృప్తినిచ్చింది' అని అన్నారు. డైరెక్టర్ గౌరి నాయుడు మాట్లాడుతూ 'గరివిడి లక్ష్మి పాత్ర గురించి అనుకున్నప్పుడే ఆనంది ఆ పాత్రకు సరిగ్గా న్యాయం చేస్తుందని నమ్మాను. నా నమ్మకాన్ని తను నిలబెట్టింది. ఆ పాత్రలో అద్భుతంగా ఇమిడిపోయింది' అని పేర్కొన్నారు.

సంక్రాంతికి విడుదల చేయకుండా ఉండాల్సింది

'ది రాజాసాబ్' చిత్రం ఫలితంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. 'ది రాజాసాబ్‌ను సరైన సీజన్‌లో విడుదల చేయలేదేమో. ఒకవేళ సంక్రాంతికి కాకుండా ఎప్పుడు వచ్చినా బాగా ఆడేదేమో. టికెట్ రేట్లు పెంచేందుకు ప్రయత్నించాం. ప్రేమి యర్ ఆలస్యమైంది. అలా చేయకుండా ఉండాల్సింది' అని అభిప్రాయ పడ్డారు.

Updated Date - Oct 14 , 2026 | 09:51 AM