ఓటీటీకి వచ్చేస్తోన్న ఎపిక్.. ఎందులో చూడొచ్చు అంటే
ABN, Publish Date - Oct 06 , 2026 | 02:41 PM
బేబీ లాంటి సన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ (Epic - First Semester).
బేబీ లాంటి సన్సేషనల్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ (Epic - First Semester). 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌తో విశేష ఆదరణ పొందిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 11 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ అక్టోబర్ 9 నుంచి ఎపిక్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఖరారైంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది.
కథ విషయానికొస్తే.. వనపర్తికి చెందిన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) అమాయకుడైన నడివయసు కుర్రాడు. అతనికి సినిమాలు తీసి డైరెక్టర్ అవ్వాలనే కోరిక ఉంటుంది, కానీ చదువులో వెనుకబడి ఉంటాడు. తండ్రి (శివాజీ), తల్లి (వాసుకి) ఒత్తిడితో గత్యంతరం లేక పైచదువుల కోసం యూకే (లండన్) వెళ్తాడు.లండన్ యూనివర్సిటీలో మొదటి రోజే అతనికి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయమవుతుంది. ఆదిత్య చాలా షై, ట్రెడిషనల్ మనస్తత్వమున్న కుర్రాడైతే, కడలి చాలా బోల్డ్, మోడర్న్ అండ్ ఇండిపెండెంట్ ఆలోచనలు ఉన్న అమ్మాయి. ఖర్చులు కలసివస్తాయని, ఒకే రూమ్‌లో ఇద్దరూ కలసి ఉండాలని కడలి ప్రతిపాదిస్తుంది. ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు వేరైనా వార మధ్య స్నేహం, ఆ తర్వాత శారీరక అనుబంధం పెరుగుతుంది. అయితే కడలి కొన్ని కండిషన్స్‌తో కూడిన రిలేషన్‌షిప్ కోరుకుంటుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఈగో క్లాషెస్, ప్రేమ వర్సెస్ శారీరక అనుబంధం, మూడ్ స్వింగ్స్, జెన్-జీ ఆలోచనా విధానాల వల్ల చిన్న చిన్న గొడవలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారిద్దరి మధ్య ఏం జరిగింది.. ? ఆదిత్య- కడలి చివరికి కలిశారా.. లేదా అనేది కథ. థియేటర్ లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మాస్ మహారాజాకి విలన్ గా జేడీ చక్రవర్తి..
గురూజీ నిర్ణయం.. లేటైనా ఓ లెక్క ఉంటాది
ఖాకీ డ్రెస్‌లో రా అండ్ వైల్డ్ బీస్ట్.. ‘స్పిరిట్’లో ప్రభాస్ విశ్వరూపం!