సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అన్న నో అన్నాడు.. తమ్ముడు సై అన్నాడు

ABN, Publish Date - Aug 05 , 2026 | 07:41 PM

ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా రిలీజ్ డేట్ ని మరో హీరో పట్టేయడం సాధారణంగా జరిగే విషయమే. ఈ మధ్యకాలంలో సినిమా వాయిదా పడింది అని అధికరికంగా చెప్పకుండా.. ఆ సినిమా రిలీజ్ డేట్ నే మరో సినిమా వస్తుంది అని చెప్పడం ట్రెండ్ గా మారిపోయింది.

Epic

ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా రిలీజ్ డేట్ ని మరో హీరో పట్టేయడం సాధారణంగా జరిగే విషయమే. ఈ మధ్యకాలంలో సినిమా వాయిదా పడింది అని అధికరికంగా చెప్పకుండా.. ఆ సినిమా రిలీజ్ డేట్ నే మరో సినిమా వస్తుంది అని చెప్పడం ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఏ సినిమా ఆగింది.. ఏ సినిమా వస్తుంది అని అంటే.. అన్న సినిమా వాయిదా పడింది. ఆ డేట్ నే తమ్ముడు అలవోకగా పట్టేశాడు. ఎవరీ అన్నదమ్ములు అంటే.. ఇంకెవరూ దేవరకొండ బ్రదర్స్. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒక మంచి హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి రణబాలి(Ranabaali) తో దిగుతున్నాడు. టాక్సీవాలా లాంటి మంచి హిట్ ని తనకు అందించిన రాహుల్ సాంకృత్యాన్ తో రెండోసారి కలిశాడు విజయ్ దేవరకొండ. దీనికి తోడు తన లక్కీ ఛార్మ్ రష్మిక మందన్నా కూడా యాడ్ అయ్యింది. ఇప్పటికే రణబాలి నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది.


ఇక రణబాలి సెప్టెంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. అన్నీ మంచిగా ఉంటే అనుకున్న టైమ్ కి విజయ్ వచ్చేవాడు. కానీ, ఈలోపే రష్మికకు గాయం అయ్యింది. వరుస షూటింగ్స్.. ఫైట్స్, డ్యాన్స్ ల వలన ఆమె హిప్ భాగంలో గాయం కావడంతో కొన్నిరోజులు రెస్ట్ తీసుకొనే పరిస్థితి. దీంతో రణబాలి షూటింగ్ కి కొన్నిరోజులు బ్రేక్ పడింది. దీనివల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంది. అందుకే చెప్పిన సమయానికి రణబాలి రాలేకపోవచ్చు. ఇక ఇదే సరైన సమయం.. అన్న రాకపోతేనే నేను ఉన్నా కదా అని ఆనంద్ దేవరకొండ సీన్ లోకి దిగిపోయాడు.


బేబీ లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న చిత్రం ఎపిక్. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈటీవీ విన్ లో భారీ విజయాన్ని అందుకున్న #90's మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఎపిక్ ని వెండితెరపై చూపించబోతున్నాడు ఆదిత్య హాసన్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మేకర్స్ మంచి డేట్ ని కూడా పట్టారు. మరి అన్నావదిన వదిలిన డేట్ కి వచ్చి తమ్ముడు హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Updated Date - Aug 05 , 2026 | 07:47 PM