వైష్ణవి చైతన్యతో లవ్.. ఆనంద్ దేవరకొండ ఏమన్నాడంటే
ABN, Publish Date - Sep 09 , 2026 | 08:50 PM
ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, పుకార్లు సర్వ సాధారణం. ముఖ్యంగా హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాలలో నటించినా.. సినిమాలు కాకుండా బయట ఎక్కడైనా కనిపించినా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి.
ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, పుకార్లు సర్వ సాధారణం. ముఖ్యంగా హీరో హీరోయిన్ కలిసి రెండు సినిమాలలో నటించినా.. సినిమాలు కాకుండా బయట ఎక్కడైనా కనిపించినా వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే అలా వచ్చిన పుకార్లు.. నిజమైన సందర్బాలు కూడా ఉన్నాయి. చాలామంది హీరోహీరోయిన్స్ ఆ పుకార్లను నిజం చేశారు. ఇంకొందరు ముందే ఖండించారు. మరికొందరు తాము కేవలం స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. తాజాగా ఆ లిస్ట్ లో ఆనంద దేవరకొండ కూడా చేరాడు.
బేబీ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల డేటింగ్ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించిన రెండో చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆనంద్.. వైష్ణవితో ప్రేమాయణంపై నోరు విప్పాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమా లేదు, డేటింగ్ లేదని.. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశాడు. తమ మధ్య ఉన్న మంచి కెమిస్ట్రీ, అలాగే ఒకే కాంబినేషన్‌లో వరుసగా రెండో సినిమా రావడం వల్లే ఇలాంటి రూమర్స్ వచ్చి ఉంటాయని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా, ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ సినిమాపై ఉన్న కొన్ని అపోహలను కూడా ఆనంద్ తొలగించాడు. చాలామంది భావిస్తున్నట్లుగా ఇది బోల్డ్ లేదా అడల్ట్ కంటెంట్‌తో కూడిన సినిమా కాదని,సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి విదేశాలకు చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లే నేటితరం యూత్ ఎమోషన్స్, అనుభవాలను చాలా సహజంగా, ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రంలో చూపించినట్లు తెలిపాడు. ఇక ఆనంద్ ఇచ్చిన క్లారిటీతో ఈ ప్రేమాయణం రూమర్స్ కి చెక్ పడింది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.