Takshakudu: తక్షకుడు టీజర్.. ఈ రేంజ్‌లో ఉందేంటి! ఆనంద్ దేవరకొండ.. చించేశాడుగా
ABN, Publish Date - Feb 03 , 2026 | 08:58 PM
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కథానాయకుడిగా బాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం తక్షకుడు
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) కథానాయకుడిగా బాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ నితాన్షి గోయల్ (Nitanshi Goel) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం తక్షకుడు (Takshakudu). ఇప్పటికే చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాగవంశీ (Naga Vamsi) సితార ఎంటర్టైన్‌మెంట్స్ (Sithara Entertainments) నిర్మిస్తోంది. గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో తెరకెక్కించిన వినోద్ అనంతోజు (Vinod Anantoju) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఎట్టకేలకు ఈ మూవీ నుంచి అప్డేట్ ఇస్తూ మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమాను రూపొందించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకున్న యువకుడు అదే రోజు రాత్రి తన కుటుంబాన్ని సర్వం కోల్పోయి ఒంటరి వాడై నడవలేని స్థితిలో ఉంటాడు. ఆపై అతనిని పలువురు గుర్తించి సపర్యలు చేయడం క్రమంగా కోలుకోని తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనే నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో హీరోయిన్‌ను మాత్రం ఎక్కడా చూపించలేదు.
ప్రతి సన్నివేశంలో హీరో పగతో రగిలిపోయే విధానం, జరిగిన నష్టం టీజర్ చూసే వారికి గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. చాలా సన్నివేశాల్లో, వాయిస్‌లో ఆనంద్ దేవరకొండ తన అన్న విజయ్ దేవరకొండను అచ్చు గుద్దినట్లు తలపించాడు. కాగా వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ఎదుటకు రానుంది. అయితే ఈ మూవీని థియేటర్లకు తీసుకువస్తారా లేక డైరెక్టు నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.