సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రేమ, ఫ్యామిలీ డ్రామా, ట్విస్టులతో 'అనకాపల్లి'.

ABN, Publish Date - Aug 06 , 2026 | 06:19 PM

'అనకాపల్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సోనూ సూద్ పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. థియేటర్లలో సినిమా చూసి విజయవంతం చేయాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.

anakapalli

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై రూపొందిన రా అండ్ రస్టిక్ ఎంటర్‌టైనర్ 'అనకాపల్లి' విడుదలకు సిద్ధమవుతోంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాతలుగా కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన వ్యవహరించగా, కో-ప్రొడ్యూసర్‌గా కాండ్రేగుల కుమార్ రాజా ఉన్నారు. కథ, స్క్రీన్‌ప్లే అందించిన త్రినాథరావు నక్కిన సినిమాలో కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు.

సినిమా విడుదల సందర్భంగా అనకాపల్లిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

సోనూ సూద్ మాట్లాడుతూ, స్థానిక కథతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు. నటీనటులు, దర్శకుడు ఎంతో కష్టపడి రూపొందించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ, తాను ఇప్పటికే సినిమాను వీక్షించానని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిందని చెప్పారు. కథలోని ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని, సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుందని అన్నారు. అనకాపల్లిలో ప్రత్యేక ప్రదర్శన తర్వాత ఇతర ప్రాంతాల్లో గ్రాండ్‌గా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

హీరో విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ, ఈ సినిమా కోసం దర్శకుడు ఖగేష్ తమ్మినేని ఎంతో శ్రమించారని చెప్పారు. అనకాపల్లిలో షూటింగ్ జరగడం వల్ల ఆ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని అన్నారు. చిత్ర బృందం మొత్తం ఒక కుటుంబంలా కలిసి పనిచేసిందని, ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, తాను చదువుకునే రోజుల నుంచే అనకాపల్లిలో ఒక సినిమా కార్యక్రమం నిర్వహించాలని కలగన్నానని, ఇప్పుడు తాను నటించి నిర్మించిన సినిమా ప్రీ రిలీజ్ వేడుక అదే పట్టణంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్థానిక ప్రేక్షకులంతా సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరారు.

నిర్మాత కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తన తండ్రి జ్ఞాపకార్థంగా నిర్మించినట్లు తెలిపారు. సినిమా నిర్మాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి ప్రజలు ఈ సినిమాను తమ చిత్రంగా భావించి ఆదరించాలని కోరారు.

హీరోయిన్ సంధ్యా వశిష్ట మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను పోషించిన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. అందమైన ప్రేమకథతో పాటు బలమైన కుటుంబ భావోద్వేగాలు కూడా చిత్రంలో ఉంటాయని చెప్పారు. దర్శకుడు, నిర్మాతలు తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా నటించేందుకు ప్రయత్నించానన్నారు.

ఈ వేడుకలో దాడి జగన్ ప్రభాకర్ కూడా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత నాయుడు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రేక్షకుల ఆదరణతో సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

Updated Date - Aug 06 , 2026 | 06:19 PM