Anakapalli: ఒక్క సెకన్ కూడా డీవియేట్ కాకుండా చూస్తారు..
ABN, Publish Date - Sep 28 , 2026 | 06:22 PM
రా అండ్ రస్టిక్ కథాంశంతో రూపొందిన తెలుగు చిత్రం ‘అనకాపల్లి’.
రా అండ్ రస్టిక్ కథాంశంతో రూపొందిన తెలుగు చిత్రం ‘అనకాపల్లి’ (Anakapalli) భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తూ, నటించిన ఈ సినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఖగేష్ తమ్మినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ ద్వారా అక్టోబర్ 2న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వి.వి. వినాయక్ మాట్లాడుతూ ‘లగడపాటి శ్రీధర్ కి మా అందరికంటే సినిమా పిచ్చి ఎక్కువ. ఆయనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్ గురించి నాకు తెలుసు. విక్రమ్ పెద్ద హీరో అయి శ్రీధర్ గారి కోరికని నెరవేర్చుతాడు. తారక్ పొన్నప్ప అందరినీ భయపెట్టేస్తున్నాడు. దర్శక, నిర్మాతలకు మంచి లాభాలు రావాలి. విక్రమ్ పెద్ద హీరో అవుతాడు. ‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఆట మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు మరింత ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. ‘అనకాపల్లి’ చిత్రంలో ప్రతీ పాత్ర మధ్య అంతే పోటీ ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు పోటీ పడి నటించారు. ‘అనకాపల్లి’ చిత్రాన్ని ఒక్క సెకన్ కూడా డీవియేట్ అవ్వకుండా చూస్తారు. ఈ చిత్రంలో పాటలు, మాటలు, ఫైట్స్ ఇలా అన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. అందరూ థియేటర్లో మా మూవీని తప్పకుండా చూడండి’ అని అన్నారు.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ‘‘అనకాపల్లి’ సినిమాని ఆల్రెడీ మేం చూశాం. సరికొత్తగా ఉంటుంది. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అనే లైన్స్ గుర్తు పెట్టుకోండి. ప్రియుడు మరింత వయలెంట్‌గా ఉంటే ఎలా ఉంటుంది.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయ్ అనేది ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ప్రియుడు ఎలా ఉండాలని ఇందులో గొప్పగా చూపించారు. తారక్ పొన్నప్ప అద్భుతంగా నటించారు. ఏ సినిమాకి అయినా ప్రతినాయకుడు ముఖ్యం. తారక్ అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు. సంధ్య కూడా గొప్పగా నటించింది. ఇంద్రజ గారు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. త్రినాథ్ గారు కొత్తగా కనిపిస్తారు. మా కోసం వచ్చిన వినాయక్ గారు, శివ నిర్వాణ గారు, సాయి రాజేష్ గారు, మైత్రి రవి గారికి థాంక్స్. విక్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. సినిమా పట్ల విక్రమ్‌కి ఎంతో కమిట్మెంట్ ఉంటుంది. ఈ చిత్రంతో విక్రమ్ నన్ను సర్ ప్రైజ్ చేశాడు. ‘అనకాపల్లి’ సినిమా అక్టోబర్ 2న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.