ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించే చిత్రం ‘అమీర్‌ లోగ్’.. టీజర్ విడుదల

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:24 PM

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో.. మాధవి రెడ్డి సోమ నిర్మిస్తోన్న చిత్రం ‘అమీర్‌ లోగ్’. తాజాగా ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Ameer Log Teaser Launch

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma) దర్శకత్వంలో.. మాధవి రెడ్డి సోమ నిర్మిస్తోన్న చిత్రం ‘అమీర్‌ లోగ్’ (AmeerLog). ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో వేద జలంధర్ , రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి పలువురు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని రానా స్పిరిట్ మీడియా రిలీజ్ చేయబోతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి (Vamsi Nandipati) చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.


ఈ టీజర్ లాంచ్ వేడుకలో వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘అమీర్ లోగ్’ మూవీ చూశాను. డబ్బు పరంగా రిచ్ అని అనుకుంటారు.. కానీ స్నేహం, ప్రేమ విషయంలో రిచ్ అని ఇందులో చూపించారు. మిడిల్ క్లాస్ జీవితాల్ని ఇందులో చూపించిన తీరు చూసి నేనెంతో ఎంజాయ్ చేశాను. ఇందులో మంచి వైబ్ కనిపించింది. ప్రాపర్ హైదరాబాద్‌ను చూపించిన చిత్రాల జాబితాల్లో ఈ సినిమా ఉంటుంది. బిల్డింగ్ స్ట్రక్ఛర్ గురించి రమణా రెడ్డిని కలిశాను. ‘అమీర్ లోగ్’తో రమణా రెడ్డి నన్నైతే నిరుత్సాహపరచలేదు. ఎంతో ఎత్తైన బిల్డింగ్‌లను నిర్మించే రమణా రెడ్డి.. ‘అమీర్ లోగ్’ని అంతే ఎత్తులో నిలబెట్టారు. అందరూ అద్భుతంగా నటించారు. ఇలాంటి ఓ చక్కటి చిత్రానికి స్మరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని పది పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఎంతో మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నారు. ఇలాంటి సినిమాలు ఆడితేనే తెలుగు పరిశ్రమ గర్వంగా తలెత్తుకుని తిరుగుతుంది. ఇలాంటి చిత్రాన్ని సపోర్ట్ చేస్తున్న స్పిరిట్ మీడియాకి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు.


దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ .. ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం వచ్చి టీజర్‌ను రిలీజ్ చేసిన వంశీకి థాంక్స్. నేను రాసిన కథను నటనతో ఇంకో లెవెల్‌కి తీసుకు వెళ్లిన ఆర్టిస్టులకు థాంక్స్. మా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నానని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. షూటింగ్ అంతా లంగర్ హౌజ్‌లో, మ్యూజిక్ అంతా కాచిగూడలో జరిగింది. ప్రాపర్ హైదరాబాద్ సినిమా ఇది. ఈ మూవీలో బిర్యానీ గురించే ఎక్కువగా ఉంటుంది. అందరూ కొత్తవారే నటించారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని అన్నారు. ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

‘రన్’ విజయ్‌ చేయాల్సిన సినిమా .. కానీ: లింగుసామి

రాత్రి తాగుతావు.. పొద్దున్నే వాగుతావు: ప్రకాష్ రాజ్‌పై బండ్ల ఫైర్

ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్'లో బాలీవుడ్ హీరో?

Updated Date - Jul 06 , 2026 | 05:38 PM