సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో.. ‘అమరం’

ABN, Publish Date - May 08 , 2026 | 08:08 AM

ఎర్రచందనం స్మగ్లర్ల జీవితం, ప్రమాదాల నేపథ్యంలో తెరకెక్కిన ‘అమరం’ టీజర్ విడుదలైంది. తేజేష్ రాజన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ఐరా అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

Amaram

ఎర్రచందనం స్మగ్లర్ల జీవన శైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలను చిత్రీకరించిన సినిమా ‘అమరం’ (Amaram) . ఈస్ట్రన్‌ ఘాట్స్‌ నేపథ్యంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాతో తేజేష్‌ రాజన్ (Tejesh Rajan) హీరోగా పరిచయమవుతున్నాడు, ఐరా అగర్వాల్ (Ira Agarwal) కథానాయిక. తిరుఅరుల్‌ కృష్ణన్ (Thiruarul Krishnan) దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ మాట్లాడుతూ.. ఓ ట్రైబల్‌ స్మగ్లర్‌కి, ఓ యువతికి మధ్య జరిగే కథ ఇదని ఆయన చెప్పారు. దాదాపు 200 మంది పాల్గొన్న యాక్షన్‌ బ్లాక్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తిరుఅరుల్‌ తెలిపారు. ముంబైకి చెందిన మార్షల్‌ ఆర్ట్స్‌ టీమ్‌ సహకారంతో మాస్టర్‌ మిరాకిల్‌ మైఖేల్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించిన మూడు భారీ యాక్షన్‌ బ్లాక్స్‌ ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగిస్తాయని ఆయన చెప్పారు.

Updated Date - May 08 , 2026 | 08:22 AM