సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కోడళ్లపై అమల అక్కినేని మనసులోని మాట..

ABN, Publish Date - Nov 17 , 2026 | 04:54 PM

అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) భార్య అమల(Amala).. ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ వస్తుంది. కన్నకొడుకు కాకపోయినా కూడా నాగ చైతన్యని, అఖిల్ ని సమానంగా చూస్తుంది.

Amala Akkineni

అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) భార్య అమల(Amala).. ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ వస్తుంది. కన్నకొడుకు కాకపోయినా కూడా నాగ చైతన్యని, అఖిల్ ని సమానంగా చూస్తుంది. ఇక ఇప్పుడు ఆ కుటుంబంలోకి ఇద్దరు కోడళ్లు అడుగుపెట్టారు. నాగచైతన్య భార్య శోభిత, అఖిల భార్య జైనబ్. ఇద్దరు కోడళ్లకు అత్తగారి హోదాలో అమల కొనసాగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె.. తన కోడళ్ల గురించి మనసులో మాట బయటపెట్టింది. తనకు తన ఇద్దరు కోడళ్లు.. ఇద్దరు కూతుళ్లలా ఉన్నారని చెప్పుకొచ్చింది.


అక్కినేని ఇంట్లో ఇన్నాళ్లూ కేవలం మగవారే ఉన్నారని, ఇప్పుడు కోడళ్ల రూపంలో తనకు ఇద్దరు కూతుర్లు దక్కారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఇంట్లో మహిళా శక్తిరావడం వల్ల వాతావరణమే పూర్తిగా మారిపోయిందని, అత్తగారిగా ఉండడం చాలా బావుందని తెలిపింది. శోభిత చాలా ప్రతిభావంతురాలని, ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలదని ప్రశంసించింది.


ఇక చిన్న కోడలు జైనబ్ గురించి మాట్లాడుతూ, అఖిల్‌తో పెళ్లికి ముందే ఆమెతో తనకు పరిచయం ఉందని, జైనబ్ తన సొంత కూతురులా తనను ఎంతో బాగా చూసుకుంటుందని తెలిపింది. ముఖ్యంగా అక్కినేని వారింట పండుగలు, వేడుకలను జరుపుకునే విధానమే జైనబ్ వచ్చాక పూర్తిగా మారిపోయిందని, ప్రతీ పండుగను ఎంతో గ్రాండ్‌గా, కళకళలాడేలా ఆమె మారుస్తుందని అమల కొనియాడింది. ప్రస్తుతం అమల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమల చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిలాంటి అత్తగారు దొరకడం చాలా అదృష్టమని, శోభిత, జైనబ్ అదృష్టవంతులన్నీ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Nov 17 , 2026 | 04:54 PM