కోట్ల ఆస్తి.. చీరలు అమ్ముతున్న నాగార్జున భార్య.. ఎంతకు దిగజారారురా
ABN, Publish Date - Sep 07 , 2026 | 07:00 PM
సీనియర్ నటి, అక్కినేని నాగార్జున సతిమణి అమల అక్కినేని ఎప్పుడూ తన సింప్లిసిటీకి, సేవా కార్యక్రమాలకు పేరుగాంచిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది.
సీనియర్ నటి, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సతిమణి అమల అక్కినేని (Amala Akkineni) ఎప్పుడూ తన సింప్లిసిటీకి, సేవా కార్యక్రమాలకు పేరుగాంచిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో అమల తన దగ్గరున్న విభిన్న రకాల తెల్ల రంగు, రకరకాల చేనేత చీరల కలెక్షన్‌ను అభిమానులతో పంచుకుంది. దేశీయంగా నేత కార్మికులు ఎంతో కష్టపడి తయారుచేసే చేనేత వస్త్రాలకు మద్దతు ఇవ్వాలని, నేత కళాకారులను ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చింది.
ఈ వీడియోలో అమల.. తనకు చేనేత చీరలు అంటే చాలా ఇష్టమని, తన పెళ్లికి కూడా వైట్ కలర్ చీరనే కట్టుకున్నట్లు తెలుపుతూ.. తనదగ్గర ఉన్న అన్నీ చీరలను చూపించింది. . తను ధరించే ఈ చీరలు ఎంత అందంగా, సౌకర్యవంతంగా ఉంటాయో వివరించడమే కాకుండా వీటిలో కొన్నింటిని తన పుట్టినరోజు సందర్భంలోను, కుమారుడి పెళ్లి రోజున బహుమతులుగా పొందినట్లు ఎంతో సంతోషంగా తెలిపింది. ముఖ్యంగా ఈ చీరలు చూపించడానికి గల కారణం కూడా తెలిపింది. తనకు తెలిసిన స్నేహితురాలు ఇలాంటి చీరలు తయారుచేస్తుందని, ఆమె తనకు ఒక మంచి చీర కూడా పంపినట్లు తెలిపింది. ఎవరైనా కావాలి అనుకున్నవారు కొనుక్కోవచ్చని.. లింకు కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నిజా నిజాలు తెలుసుకోకుండా అమల అక్కినేనిపై నెగిటివిటీని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కోటానుకోట్ల ఆస్తి ఉండి కూడా అమల చీరల వ్యాపారం ప్రారంభించిందని, డబ్బుల కోసం ఈ పనిచేస్తోందని అసత్యపు వ్యాఖ్యలు పుట్టించడం చాలా తప్పు అని, ఇలాంటి వ్యాఖలు చూస్తుంటే కొంతమంది ట్రోలర్స్ ఎంత దిగజారారో తెలుస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఒక మంచి ఉద్దేశంతో చేనేత కళాకారుల శ్రమను గుర్తించి సపోర్ట్ చేసిన వీడియోను ఇలా తప్పుగా చిత్రీకరించడంపై అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అమల వీడియోలో ఎక్కడా కూడా తన దగ్గర ఉన్న చీరలను అమ్మకానికి పెట్టాననిగానీ లేదా తన వద్ద కొనుక్కోవాలనిగానీ చెప్పలేదు. తను ధరించే ఈ చీరలు ఎంత అందంగా, సౌకర్యవంతంగా ఉంటాయో చెప్తూ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. దీనిని ఇలా చేయడం పద్దతి కాదని కొందరు అంటుంటే.. మరికొందరు.. ఒకవేళ సొంతంగా వ్యాపారం ప్రారంభించినా అందులో తప్పేముంది? రామ్ చరణ్ భార్య ఉపాసన పచ్చళ్ల వ్యాపారం పెట్టలేదా.. చాలామంది హీరోయిన్స్ వ్యాపారాలు చేయడం లేదా ? అని ప్రశ్నిస్తున్నారు.