నచ్చిన అమ్మాయిలకు బీట్ వేయండి.. ఫ్యాన్స్ కి బన్నీ సలహా
ABN, Publish Date - Jul 28 , 2026 | 07:21 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో సమయం చిక్కినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మంగళవారం బన్నీ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు.
అభిమానం- ఆత్మీయత- అంతా ఒక బూటకం అంటారు కొందరు.. కానీ, సినిమా స్టార్స్ ఫ్యాన్స్ ను చూస్తే వారి అభిమానంలో ఏ లాంటి బూటకం కనిపించదు. మరి అలాంటి అభిమానులకు స్టార్స్ ఏలాంటి సందేశాలు ఇవ్వాలి.. ఈ డౌట్ ఎందుకంటే - అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కు చేసిన సూచన ఇప్పుడు హాట్ టాపిక్... అదేంటో చూద్దాం...!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులతో సమయం చిక్కినప్పుడల్లా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. మంగళవారం బన్నీ తన అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏన్యూవల్ సమ్మిట్ జరిగింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బన్నీ అభిమానులు, కేరళ, కర్ణాటకలోని ఫ్యాన్స్ కూడా పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించారు బన్నీ.. అప్పుడే ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి ఎప్పటి నుంచో తాను చెప్పాలనుకున్న మాట చెప్పేశారు. అందులో అభిమానులకు అనవసరమైన అంశాల కోసం టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు... అంతా బాగానే ఉంది- చివరలో బన్నీ నీకు నచ్చిన ఓ అమ్మాయి ఇంటి బయట వెయిట్ చేయ్... అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావ్... అంటూ చెప్పారు... దానినే కొందరు తప్పు పడుతున్నారు...
కాలం మారుతోంది... జెన్ జీ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయడానికి స్టార్స్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు... కొందరు పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తుందటే... మరికొందరు యూత్ కు కావలసిన అంశాలను జోడిస్తూ ఆకట్టుకుంటున్నారు.... అదే తీరున బన్నీ కూడా తనను కలుసుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చిన ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి నచ్చిన అమ్మాయి ఇంటి ముందు బీట్ వేయమని చెప్పి ఉండవచ్చన్నది పరిశీలకుల మాట. సినిమాల్లో అమ్మాయిలను టీజ్ చేస్తూ, వెంటపడి ఏడ్పించే హీరోలు రియల్ లైఫ్ లో అలా ఉండరు... కానీ, తాము సినిమాల్లో టీజ్ చేస్తూ కనిపించి, బయట ఫ్యాన్స్ ను అలా నడచుకోవద్దని చెప్పడం కద్దు. అయితే బన్నీ రివర్స్ లో ఫ్యాన్స్ లో కాస్త జోష్ నింపడానికి అలా అని ఉండవచ్చు.
ఫ్యాన్స్ కు నచ్చిన అమ్మాయికి సైటేస్తూ సాగమన్న బన్నీ అనేక చిత్రాల్లో హీరోయిన్స్ ను టీజ్ చేస్తూ మెప్పించారు. అలా సాగిన సందర్భాల్లో అల్లు అర్జున్ అభినయం సైతం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అలాంటి బన్నీ హీరోయిన్ లేకుండా నటిస్తే ఎలా ఉంటుంది?... నిజంగా అది ఓ ఛాలెంజే!... రాకా తరువాత బన్నీ నటించబోయే లోకేశ్ కనగరాజ్ సినిమాలో ఆయనకు జోడీగా ఎవరూ ఉండరని టాక్. మరి ఆటపాటలతో అలరిస్తూ తెరపై కనిపించిన బన్నీ ఇప్పుడు హీరోయిన్ లేకుండా నటిస్తే ఫ్యాన్స్ ఏమవుతారో? బన్నీ తన అభిమానులను ఓ ఆర్మీలా తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఆయన ఫ్యాన్స్ ను అల్లు అర్జున్ ఆర్మీ అనీ పిలుస్తున్నారు. కాబట్టి వారు తమ హీరో ఏం చేసినా చూస్తారనీ బన్నీ ఆత్మీయులు భావిస్తున్నారు.ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతూ, వారికి తగిన సూచనలు ఇస్తూ సాగుతున్న బన్నీని చూస్తే భవిష్యత్ లో ఆయన పాలిటిక్స్ లోకి వస్తారనీ వినిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ మీట్స్ అన్నీ రాజకీయ రంగ ప్రవేశం కోసమేనని, ఇక నుంచి ఇలాంటి మీటింగ్స్ ఎక్కువగా ఉండనున్నాయని టాక్. మరి బన్నీ మనసులో ఏముంది!? నిజంగా తను పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాడా!? వీటన్నిటికీ కాలమే సమాధానం. ఏమవుతుందో చూద్దాం...