సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డైరెక్టర్లకు.. నో ఎంట్రీ? అల్లు అర్జున్ డేట్స్ ఫుల్ ప్యాక్!

ABN, Publish Date - Aug 18 , 2026 | 06:36 AM

అల్లు అర్జున్ వరుసగా అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్‌లతో సినిమాలు చేస్తున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బన్నీ డైరీ 2028 వరకు ఫుల్‌గా బిజీగా మారింది.

Allu Arjun

'పుష్ప' సిరీస్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) క్రేజ్ పాన్ ఇండియా సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది. తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన బన్నీ.. ఇప్పుడు తన తదుపరి సినిమాలను కూడా అదే రేంజ్‌లో, ఊహించని కాంబినేషన్లలో లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌లు, లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అయితే ఈ బిజీ లైనప్ వల్ల టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో రాకా (Raaka) అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)ఈ చిత్రాన్ని ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్.

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ పూర్తి చేసి, 2027లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పడుకోణె (Deepika Padukone) కథానాయికగా నటిస్తుండగా.. జాన్వీ కపూర్ (Janhvi Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)లు కీలక పాత్రల్లో అలరించబోతున్నారనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

రాకా సినిమా పూర్తయిన వెంటనే, బన్నీ మరో తమిళ విలక్షణ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో తన 'AA23' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్టర్, ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన లోకేష్.. అల్లు అర్జున్ కోసం ఒక అత్యంత స్టైలిష్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేస్తున్నారట.

ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే.. ఇందులో అసలు హీరోయిన్ క్యారెక్టరే ఉండదట. పూర్తిగా రా అండ్ రస్టిక్ యాక్షన్, డార్క్ ఎమోషన్స్‌పైనే కథ సాగుతుందని సమాచారం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఎలాంటి గ్యాప్స్ లేకుండా స్పీడ్ షెడ్యూల్స్‌తో పూర్తి చేసి, 2027 చివరినాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు భారీ సినిమాల అనంతరం, మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన, ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేయబోతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రావడం దాదాపు ఖాయమైంది.

ఇలా వరుసగా కోలీవుడ్, మాలీవుడ్ దర్శకులతోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒకే చేయడంతో అల్లు అర్జున్ డైరీ 2028 చివరి వరకు పూర్తిగా ప్యాక్ అయిపోయింది. కంటిన్యూయస్ షూటింగ్స్, పాన్ ఇండియా ప్రమోషన్స్‌తో బన్నీ రాబోయే రెండు మూడు ఏళ్లు అత్యంత బిజీగా గడపనున్నారు. అల్లు అర్జున్ ఈ స్థాయిలో ఇతర భాషా దర్శకులకు క్యూ ఇవ్వడంతో.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఎవరూ ప్రస్తుతం ఆయనకు కథలు చెప్పేందుకు ముందుకు రావడం లేదట. బన్నీ డేట్స్ ఖాళీగా లేకపోవడంతో, తెలుగు దర్శకులు కొన్నాళ్ల పాటు ఆయనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి 2028 తర్వాతైనా అల్లు అర్జున్ లైనప్‌లోకి ఏ తెలుగు దర్శకుడు వస్తాడో? ఏ టాలీవుడ్ కాంబినేషన్ సెట్ అవుతుందో వేచి చూడాలి.

Updated Date - Aug 18 , 2026 | 06:36 AM