Allu Arjun: రామ్ చరణ్ దంపతులకు.. అల్లు అర్జున్ విషెస్
ABN, Publish Date - Feb 02 , 2026 | 09:18 PM
రామ్‌చరణ్, ఉపాసనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు.
రామ్‌చరణ్, ఉపాసనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 31 రాత్రి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బన్నీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. ‘మరోసారి తల్లిదండ్రులైన ఉపాసన- రామ్‌చరణ్‌లకు శుభాకాంక్షలు. చిరంజీవి గారి గర్వం, ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబం మొత్తం నవ్వుతూ కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. చిన్నారులు తమ రాకతో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు.